తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్టూడెంట్​ను కిడ్నాప్ చేసిన టీచర్​.. డబ్బులు ఇవ్వలేదని బాత్రూమ్​లో పడేసి.. - ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. కోచింగ్ సెంటర్ టీచర్​.. ఓ ఆరేళ్ల విద్యార్థిని డబ్బుల కోసం కిడ్నాప్​ చేశాడు. బాలుడి కుటుంబ సభ్యులను బెదిరించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల ఆరేళ్ల బాలుడ్ని హత్యచేశాడు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

murdered student deoria
విద్యార్థి హత్య

By

Published : Jul 7, 2022, 1:01 PM IST

విద్యార్థిని ఉపాధ్యాయుడే కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన ఉత్తప్​ప్రదేశ్​ దేవరియాలో జరిగింది. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.5 లక్షలు మృతుడి తండ్రి నుంచి నిందితులు డిమాండ్ చేశారు. బాధితుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల ఆగ్రహించిన నిందితులు బాలుడ్ని హత్యచేసి టాయిలెట్​లో పడేశారు.

అసలేం జరిగిందంటే:లార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్ఖోలి గ్రామానికి చెందిన బాలుడు సంస్కార్ యాదవ్ (6).. ప్రతి రోజు ఉదయం కోచింగ్ సెంటర్​కు వెళ్లేవాడు. బుధవారం కూడా అలా వెళ్లిన సంస్కార్​ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో అతని తండ్రి, కుటుంబ సభ్యులు వెతికారు. ఎక్కడా కనిపించక పోవడం వల్ల కోచింగ్ సెంటర్​కు వెళ్లి ఆరా తీశారు. ఆ రోజు కోచింగ్ సెంటర్​ రాలేదని వారికి తెలిసింది.

సాయంత్రం సమయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు ఓ లేఖ అందింది. రూ.5 లక్షలు సిద్ధం చేసుకోవాలని.. లేదంటే మీ బిడ్డను హత్య చేస్తామని ఆ లేఖలో ఉంది. వెంటనే మృతుడి తండ్రి గోరఖ్ యాదవ్​ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసు బుధవారం రాత్రంతా నిందితుల కోసం వెతికారు. గురువారం ఉదయం కోచింగ్ టీచర్ ఇంట్లోని టాయిలెట్​లో శవమై కనిపించాడు సంస్కార్ యాదవ్. కోచింగ్ టీచర్ మనువడికి ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపారు పోలీసులు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇవీ చదవండి:పది నెలల బాలికకు రైల్వే ఉద్యోగం.. అదెలాగంటే?

'లాలూ శరీరంలో కదలికలు లేవు.. చెకప్ అయ్యాక దానిపై నిర్ణయం!'

ABOUT THE AUTHOR

...view details