తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పదోతరగతి విద్యార్థినిపై టీచర్​ అత్యాచారం- గర్భవతిని చేసి.. - మైనర్​పై అత్యాచారం

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడో టీచర్​. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అమానుష సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

minor
మైనర్​పై టీచర్​ అత్యాచారం

By

Published : Dec 4, 2021, 10:20 PM IST

కోచింగ్​ క్లాసులకు వచ్చే పదో తరగతి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో ఓ ఉపాధ్యాయుడు. కొన్ని నెలల క్రితం జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

కేరళలోని ఎరోడ్​ జిల్లాకు చెందిన బాధితురాలు కోచింగ్​ నిమిత్తం నిందితుడి దగ్గరకు వెళ్లేది. ఈ క్రమంలో బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని నెలలకు బాలిక గర్భం దాల్చడం వల్ల తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. దీనిపై స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. నిందితుడిని అరెస్ట్​ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

డ్రైవర్​ వేధింపులు..

కర్ణాటక మంగళూరులోని ఓ ప్రైవేట్​ స్కూల్​లో ఆరో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. నిందితుడు అదే స్కూల్​లో పనిచేసే స్కూల్​ వ్యాన్​ డ్రైవర్​ కృష్ణప్పగా పోలీసులు గుర్తించారు. తమ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి :సహజీవనానికి 'నో' చెప్పాడని.. ప్రియుడిపై యాసిడ్ దాడి!

ABOUT THE AUTHOR

...view details