ఆన్లైన్లో తాను పాఠాలు బోధిస్తున్న పిల్లలను చూడాలని ఆశపడ్డ ఓ ఉపాధ్యాయురాలు.. అది నెరవేరకుండానే(Teacher Dies During Class) కన్నుమూశారు. ఈ విషాద ఘటన కేరళ కాసరగోడ్ జిల్లాలో(Kerala kasaragod) జరిగింది.
అసలేం జరిగింది?
అడొట్టాకాయాలోని ప్రభుత్వ సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో.. కల్లార్ ప్రాంతానికి చెందిన మాధవి ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. గురువారం రాత్రి మూడో తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో గణితం బోధించిన ఆమె.. క్లాసు ముగిసిన కాసేపటికే(Teacher Dies During Class) ప్రాణాలు కోల్పోయారు.
క్లాసు చెప్పే సమయంలో తన ఫోన్లో రికార్డైన దృశ్యాలు... ఆమె కుటుంబ సభ్యులతో పాటు, తన విద్యార్థులకు తీరని శోకాన్ని మిగిల్చాయి. క్లాస్ చెబుతున్నప్పుడు ఆమె.. అస్వస్థతగా కనిపించారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఆమె తీవ్రంగా దగ్గడం ప్రారంభించారు. ఆ వీడియోలో... వచ్చే వారం పాఠశాలలను పునఃప్రారంభం కానున్నాయని.. తాను పిల్లలందరినీ చూడాలనుకుంటున్నట్లు మాధవి చెప్పారు. ఆ తర్వాత విద్యార్థులకు హోం వర్క్ ఇచ్చిన ఆమె.. ఆకస్మికంగా క్లాసును ముగించారు.
కొద్దిసేపటి తర్వాత... మాధవి ఇంటికి వచ్చిన బంధువు ఒకరు నేలపై అపస్మారక స్థితిలో ఆమె పడి ఉండడం చూశారు. ఆ వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మాధవి చనిపోయినట్లు ధ్రువీకరించారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అధిక రక్తపోటు కారణంగానే ఆమె మరణించారని చెప్పారు.
ఇదీ చూడండి:బిల్డింగ్ పైనుంచి విద్యార్థిని తలకిందులుగా వేలాడదీసిన ప్రిన్సిపల్
ఇదీ చూడండి:ఆరు రోజుల పసికందును అమ్మేసిన తండ్రి.. చివరికి!