విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు.. మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ చమోలీలో జరిగింది. బాధితురాలిని ప్రలోభపెట్టి అడవిలోకి తీసుకెళ్లి వేధింపులకు గురిచేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నిందితుడు.. మైనర్‌ను అడవిలోని ఏకాంత ప్రదేశానికి రమ్మని మెసేజ్ చేశాడు. అక్కడిరాగానే బాలికను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ దాడికి చూసిన స్థానికులు అక్కడికి వచ్చేసరికి నిందితుడు పరారయ్యాడు. బాధితురాలిని స్థానికులు ఆమె ఇంటికి చేర్చారు. కుటుంబ సభ్యులకు తనపై జరిగిన దాడి గురించి చెప్పింది బాధితురాలు. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమెరికా మహిళ ఎదురుగా వికృత చేష్టలు..
అమెరికాకు చెందిన 40 ఏళ్ల మహిళ ముందు అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ క్యాబ్ డ్రైవర్. క్యాబ్‌లో బాధితురాలు ప్రయాణిస్తున్న సమయంలో వికృత చేష్టలు చేశాడు. నిందితుడిని యోగేంద్ర ఉపాధ్యాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు.. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త అని తెలిపారు. కొంత కాలం క్రితం భారత్‌కు ఆమె వచ్చిందని వెల్లడించారు. క్యాబ్‌లో ఉన్న ప్రయాణికులందరూ దిగిపోయాక అతడు వికృత చేష్టలకు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ముంబయిలో జరిగిందీ ఘటన.