Teacher propose student: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే ఓ విద్యార్థినికి సినిమాటిక్ స్టైల్‌లో లవ్ ప్రపోజ్ చేశాడు. అందరూ చూస్తూండగానే క్లాస్ రూం మధ్యలో మోకాళ్లపై కూర్చొని హీరో లెవల్‌లో 'ఐ లవ్ యూ' చెప్పాడు. ఈ తంతంగాన్నంతా అక్కడే ఉన్న కొంతమంది విద్యార్థులు వీడియో తీయడం వల్ల ఇది వైరల్‌గా మారింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం వల్ల అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ ఘటన అసోంలోని దేమాజీ నగరంలో జరిగింది.
సినిమా స్టైల్‌లో స్టూడెంట్‌కు టీచర్ ప్రపోజ్.. పోయిన ఉద్యోగం - టీచర్‌కు ప్రపోజ్ చేసిన స్టూడెంట్
Teacher propose student: ఉపాధ్యాయుడు ఓ విద్యార్థికి సినిమా స్టైల్‌లో ప్రపోజ్ చేశాడు. ఈ ఘటన అసోంలోని దేమాజీ నగరంలో జరిగింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం వల్ల అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు.
దేమాజీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన కేంద్రంలో మనోజ్ కుంబంగ్ అనే వ్యక్తి శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. అందులోనే ట్రైనింగ్ తీసుకుంటున్న ఓ విద్యార్థినికి క్లాస్ రూంలోనే సినిమాటిక్ రేంజ్‌లో ప్రపోజ్ చేసిన వీడియోలు వైరల్ కావడం వల్ల సంబంధిత అధికారులు మనోజ్‌పై చర్యలు తీసుకున్నారు. అతడిని విధుల్లోంచి తొలగించగా.. విద్యార్థినిని కూడా సస్పెండ్ చేశారు. "ఇది ఎవరూ ఊహించని సంఘటన. అతడు ఎందుకు అలా చేశాడో తెలియదు. కానీ, విషయం మా దృష్టికి రాగానే అతడితో పాటు విద్యార్థినిపై చర్యలు తీసుకున్నాం. అలాగే దీన్ని ఫోన్‌లో చిత్రీకరించిన వారిపైనా చర్యలు తీసుకుంటాం" అని శిక్షణా కేంద్రం అధికారి ఒకరు తెలిపారు.
ఇదీ చదవండి:టీఎంసీ నేతల దారుణ హత్య.. రక్తపు మడుగులో ముగ్గురు!