TDP calls for Nyayaniki Sankellu program tomorrow: న్యాయానికి సంకెళ్లు పేరిట తెలుగుదేశం పార్టీ మరో వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది. నారా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా 'న్యాయానికి సంకెళ్లు' పేరిట నిరసన చేపట్టనున్నట్లు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఈ మేరకు... నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని టీడీపీ శ్రేణులకు లోకేశ్ పిలుపునిచ్చారు. రేపు రాత్రి 7 గం.కు చేతులకు తాడు, రిబ్బను కట్టుకొని నిరసన తెలపనున్నట్లు లోకేశ్ తెలిపారు. రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు నిరసన తెలపాలని పేర్కొన్నారు. న్యాయానికి ఇంకెన్నాళ్లు సంకెళ్లు అని నినదించండంటూ లోకేశ్ టీడీపీ శ్రేణులు.. చంద్రబాబు అభిమానులకు పిలుపునిచ్చారు. నిరసన తెలిపిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని సూచించారు. టీడీపీ కొనసాగించే ఈ ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని లోకేశ్ రాష్ట్ర ప్రజలను కోరారు.
TDP Motha Mogiddam Program: చంద్రబాబుకు మద్దతుగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మోగిన మోత..
మద్దతుగా మోత మోగించిన టీడీపీ శ్రేణులు: గత నెల 30వ తేదీ చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం కార్యక్రమాని టీడీపీ పిలుపునిచ్చింది. రాత్రి 7 గంటలకు 5 నిమిషాల పాటు ఏదో ఒక రకంగా శబ్ధం చేసి చంద్రబాబుకు మద్దతు తెలపాలని పేర్కొంది. 5 కోట్ల రాష్ట్ర ప్రజల ఆగ్రహం ఎలా ఉంటుందో ప్యాలస్‌లో ఉన్న సైకో జగన్‌కు వినబడేలా నిరసన తెలపాలని కోరింది. ఇంట్లోనో ఆఫీస్‌లోనో ఇంకెక్కడ ఉన్నా బయటకొచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టండి లేదా విజిల్ వేయండని తెలిపారు. రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ నిరసన తెలపాలని ట్విట‌్టర్ ద్వారా పేర్కొన్నారు. మీరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నారు.