TDP Nara Lokesh Call: ప్రగతి వెలుగులు పంచే చంద్రుడిని చీకట్లో నిర్బంధించారన్న లోకేశ్.. గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం అని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాత్రి 'కాంతితో క్రాంతి' పేరుతో కార్యక్రమం చేపట్టాలని నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కోరారు. కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. ప్యాలెస్‌లో ఉన్న జగనాసురుడి కళ్లు బైర్లు కమ్మేలా.. 'కాంతితో క్రాంతి' కార్యక్రమంలో భాగంగా రేపు రాత్రి 7 నుంచి 7.05 వరకు విద్యుత్ లైట్లు ఆర్పేసి నిరసన తెలపాలని లోకేశ్ సూచించారు. చంద్రబాబుకు మద్దతుగా దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ వేసి సంఘీభావం తెలపాలని కోరారు. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి టార్చి లైట్లు వెలిగించాలని, రోడ్లపై ఉంటే వాహనం లైట్లు బ్లింక్(ఆన్, ఆఫ్) చేసి బాబుతో నేను అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని లోకేశ్ తెలిపారు.
Protests Against Chandrababu Arrest: చంద్రబాబును విడుదల చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
నారా లోకేశ్ మరి కాసేపట్లో రాజమండ్రి చేరుకోనున్నారు. అమరావతి (Amaravati) నుంచి రాజమహేంద్రవరం బయలుదేరిన నారా లోకేశ్.. ఇవాళ మధ్యాహ్నం చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. లోకేశ్ తో పాటు కుటుంబసభ్యులు ములాఖత్ కానుండగా.. పార్టీకి సంబంధించిన పలు అంశాలు చంద్రబాబుతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా జనసేనతో సమన్వయానికి ఐదుగురు సభ్యులను చంద్రబాబు, లోకేశ్ ఖరారు చేయనున్నారు.
లోకేశ్‌ను కలిసేందుకు రాజమండ్రి తరలివస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులనుపోలీసులు అడ్డుకుంటున్నారు.పొట్టిపాడు టోల్‌గేట్ వద్ద దేవినేని ఉమ, కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ వెంట రాజమండ్రి వెళ్లకూడదంటూ అడ్డుకోవడంతో.. పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. లోకేశ్ ను కలిసేందుకు వెళ్తున్న కార్యకర్తల వాహనాలపై పోలీసుల ఆంక్షలు (Police restrictions) విధించారు. నేతలు ఎవరూ కూడా లోకేశ్ తో కలిసి రాజమండ్రికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.