తెలంగాణ

telangana

ETV Bharat / bharat

TDP Mahanadu 2023 టీడీపీ శ్రేణులతో పసుపెక్కిన రాజమహేంద్రవరం.. మహానాడు ప్రారంభోపన్యాసంతో హుషారెత్తించిన చంద్రబాబు - mahanadu program representatives registration

TDP Mahanadu 2023: ఎన్నికల ఏడాది ప్రవేశించిన వేళ... రాజమహేంద్రవరం వేదికగా పసుపు పండుగ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. వేదికపై చంద్రబాబు, లోకేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇరు రాష్ట్రాల నుంచి దాదాపు 15 వేల మంది ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

TDP Mahanadu 2023
టీడీపీ మహానాడు

By

Published : May 27, 2023, 1:16 PM IST

Updated : May 27, 2023, 5:45 PM IST

టీడీపీ శ్రేణులతో పసుపెక్కిన రాజమహేంద్రవరం.. మహానాడు ప్రారంభోపన్యాసంతో హుషారెత్తించిన చంద్రబాబు

TDP Mahanadu 2023: మహానాడు తొలిరోజు గోదావరి తీరాన పసుపు జెండా రెపరెపలాడింది. తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు తమ్ముళ్లు నూతనుత్తేజంతో కదం తొక్కారు. జై ఎన్టీఆర్.. జై తెలుగు దేశం.. నినాదాలతో రాజమహేంద్రవరం పసుపెక్కింది. అగ్రనేతలు, సీనియర్ నేతలు, ఆవిర్భావం నుంచి ఉన్న నేతలతో.. మహానాడు ప్రాంగణం కళకళలాడింది. తొలిరోజు తొలి సమావేశంలో.. పార్టీ అధినేత ప్రారంభోపన్యాసం చేశారు. ఏపీకి త్వరలో మంచిరోజులు వస్తాయని.. భవిష్యత్​లో అభివృద్ధికి మరో పేరుగా ఏపీ నిలుస్తుందని చంద్రబాబు ప్రకటించారు.

మహానాడు ప్రాంగణం వద్ద ప్రతినిధుల నమోదు ప్రక్రియతో తొలిరోజు మహానాడు సమావేశాలు ప్రారంభమైయాయి. జిల్లాల వారీగా ప్రతినిధులకు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే కౌంటర్ల వద్ద టీడీపీ శ్రేణులు కిక్కిరిసారు. మహానాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రతినిధిగా తన పేరును నమోదు చేసుకున్నారు. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్​ను సందర్శించిన లోకేష్ వేదిక వద్దకు చేరుకున్నారు.

చంద్రబాబు, లోకేశ్ రాత్రి మహానాడు ప్రాంగణంలోనే బస చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడు వేదిక వద్దకు చేరుకున్నారు. చిత్తూరు జిల్లా కౌంటర్​లో ప్రతినిధిగా టీడీపీ అధినేత చంద్రబాబు తన పేరును నమోదు చేసుకున్నారు. ఫోటో ఎగ్జిబిషన్ స్టాళ్లను ఆయన ప్రారంభించారు. వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మహానాడును లాంఛనంగా ప్రారంభించారు. మహానాడుకు తెలుగుదేశం శ్రేణులు పోటెత్తారు. తొలిరోజు 15 వేల మందికే ఆహ్వానాలు పంపారు.

ఇదీ చదవండి:పసుపుమయంగా గోదావరి.. తెలుగుదనం ఉట్టిపడేలా మహానాడు.. మేనిఫెస్టోపై దృష్టి పెట్టిన పార్టీ

అన్ని ప్రాంతాల నుంచి శ్రేణులు తరలి రావటంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ, మరికొందరి ముఖ్య నేతల వాహనాలు ట్రాఫిక్ జామ్​లో ఇరుక్కుపోయాయి. ధవళేశ్వరం, వేమగిరి, బొమ్మూరు, మోరంపూడి, దివాన్ చేరు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యాయి. పోలీసులు ట్రాఫిక్ నియంత్రించకుండా చేతులెత్తేశారు.

గత రెండేళ్ల కాలంలో చనిపోయిన పార్టీ నేతలు, కార్యకర్తలకు మహానాడు సంతాపం ప్రకటించింది. నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. జనహృదమై నారా లోకేశ్ అంటూ యువగళం పాదయాత్రపై కేశినేని చిన్ని ముద్రించిన పుస్తకంపై పార్టీ కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది. పాదయాత్రతో మంచి జోష్ వచ్చిందంటూ లోకేశకు కార్యకర్తలు చెబుతున్నారు.

లోకేశ్​ తన పేరును గుంటూరు జిల్లా ప్రతినిధుల నమోదు కేంద్రంలో.. నమోదు చేసుకున్నారు. మరోవైపు.. మహానాడులో ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను ప్రకటించనున్నారు. రెండు రోజుల మహానాడులో ఇవాళ ప్రతినిధుల సభ, రేపు బహిరంగ సభ ఉంటాయి. ఈ కార్యక్రమానికి 15 వేల మందికి తెలుగుదేశం ఆహ్వానాలు పంపింది. అయితే అంతకు రెండింతలకు పైగానే ప్రతినిధులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇవాళ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్న చంద్రబాబు.. ప్రతినిధుల సభను ప్రారంభిస్తారు. ఈ మహానాడులో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 15 తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించనుండగా, తెలంగాణపై 6 తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చలు నిర్వహిస్తారు. ఇక రేపు సాయంత్రం నిర్వహించే బహిరంగ సభకు 15 లక్షల మంది తరలివస్తారనే అంచనాతో భారీ ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిపై.. మహానాడు వేదికగా డిజిటల్‌ ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటుచేశారు.

ఇవీ చదవండి:

Last Updated : May 27, 2023, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details