TDP Leaders Responded to TDP Party Funds: చంద్రబాబు బెయిల్ అడ్డుకునేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తులు వేయడంపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీ వైసీపీ, ధనిక ముఖ్యమంత్రిగా పేరుగాంచిన జగన్.. తెలుగుదేశం పార్టీ విరాళాలపై ఆరోపణలు చేయడం తగదని టీడీపీ నేతలు అన్నారు. క్విడ్‌ప్రోకో రాష్ట్రానికి పరిచయం చేసిందే జగనన్న తెలుగుదేశం నేతలు.. వైసీపీకీ మేఘా, జిందాల్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సంస్థల నుంచి కోట్లాది రూపాయల ఎలా వచ్చాయో తెలపాలన్నారు.
చంద్రబాబు బెయిల్‌పై బయటకు రాకుండా చేయాలన్న కుట్రతో సీఐడీ రోజుకొక అంశాన్ని తెరపైకి తెస్తోందని తెలుగుదేశం పార్టీ మండిపడింది. న్యాయస్థానానాలే తప్పుదోవ పట్టించేలా స్కిల్ ప్రాజెక్ట్ నిధులు తెలుగుదేశం పార్టీకి మళ్లీంచారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి సభ్యత్వాల ద్వారా వచ్చిన సొమ్ము, విరాళాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా వచ్చే ఆదాయ వివరాలు ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు, ఆదాయపన్ను శాఖలకు తెలియజేస్తున్నామన్నారు.
దేశంలోనే అత్యంత భారీగా విరాళాలు పొందుతున్న ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ అగ్రస్థానంలో ఉందని, జాతీయ పార్టీలతో పోల్చితే ఐదో స్థానంలో ఉందని వారు ఆరోపించారు. ఆ పార్టీకి అంతంత నిధులు ఎలా వచ్చాయో సీఎం జగన్ చెప్పాలంటూ వారు నిలదీశారు. వివిధ సంస్థలకు కాంట్రాక్ట్‌లు, ప్రాజెక్ట్‌లు అప్పగించి ప్రతిఫలంగా వైసీపీ పార్టీకి విరాళాలు ఇప్పించుకున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ 2018-19 సంవత్సరంలో 11 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను వైసీపీకి విరాళంగా అందించారని దానికి ప్రతిఫలంగానే విశాఖను లూటీ చేయమని ఆయనకు రాసిచ్చారా అంటూ ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో హెటెరో సంస్థకు సంబంధించిన భూ వివాదాన్ని పరిష్కరించినందుకు 10 కోట్లు తీసుకున్నారా అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే శంకర్రావు కోటీ 35 లక్షల విరాళంగా ఇచ్చారనే ఇసుక దందాకు అనుమతించారా అని నిలదీశారు.
Lokesh Comments: చంద్రబాబు ఏనాడు తప్పు చేయరు.. న్యాయం ఆలస్యం కావచ్చేమో కానీ మావైపే ఉంటుంది: లోకేశ్