తెలంగాణ

telangana

ETV Bharat / bharat

TDP Leaders Protests Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్​ను వ్యతిరేకిస్తూ నిరసన జ్వాలలు.. పలుచోట్ల ఉద్రిక్తత - చంద్రబాబు కోసం టీడీపీ నేతల పూజలు

TDP Leaders Protests Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. విశాఖలో ర్యాలీ చేస్తున్న టీడీపీ శ్రేణులపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చంద్రబాబు విడుదల కావాలని.. పలుచోట్ల శ్రేణులు దేవాలయాల్లో పూజలు చేశారు.

TDP Leaders Protests Against Chandrababu Arrest
TDP Leaders Protests Against Chandrababu Arrest

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 10:40 PM IST

TDP Leaders Protests Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు.. పూజలు చేసిన పార్టీ శ్రేణులు

TDP Leaders Protests Against Chandrababu Arrest:చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. విశాఖలో టీడీపీ కార్యకర్తలు కదం తొక్కారు. ర్యాలీకి సిద్ధమైన కార్యకర్తలను, నేతలను పార్టీ కార్యాలయం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, శ్రేణుల మధ్య తోపులాటలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరును నిరసిస్తూ... నేతలు రోడ్డుపై బైఠాయించారు. వారిని బలవంతంగా వ్యానులో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై అయ్యన్నపాత్రుడుఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుకుంటూ.. గుంటూరు నాజ్‌ సెంటర్‌లోని ఆంజనేయ స్వామి ఆలయంలో తెలుగుదేశం శ్రేణులు ప్రత్యేక పూజలు (TDP Leaders Prayers for Chandrababu) చేశారు. మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేసి.. కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా చంద్రబాబుని స్కిల్ డెవలప్​మెంట్ స్కాంలో (Skill Development Case) ఇరికించిందని మండిపడ్డారు.

Public Protest Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్​పై ప్రజాగ్రహం.. నిరసనల వెల్లువ.. 'టీడీపీ నేతల హౌస్ అరెస్ట్'

మోకాళ్లపై నడుచుకుంటూ: చంద్రబాబు నాయుడు సభలకు, నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజల మద్దతు తెలుపుతున్నారనే అక్కసుతోనే వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎన్జీవో కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలోకి మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్లారు. తర్వాత నల్ల మాస్కులు ధరించి పట్టణంలో మౌన ర్యాలీ నిర్వహించారు.

వాటర్‌ ట్యాంక్‌ పైకి ఎక్కిన మహిళలు: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తెలుగు మహిళలు.. సంత గేటు వద్ద ఉన్న వాటర్‌ ట్యాంక్‌ పైకి ఎక్కి నిరసన తెలిపారు. చంద్రబాబు నాయుడుని తక్షణమే విడుదల చేయాలని, అక్రమ కేసులు (Fake cases on chandrababu) రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కడప ప్రెస్‌ క్లబ్‌లో రౌండ్ టేబుల్‌ సమావేశం నిర్వహించిన అఖిలపక్షం నేతలు.. అధికారం చేతిలో ఉందని జగన్ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లపాటు మౌనంగా ఉన్న వైసీపీ సర్కార్.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టును రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరు కూడా సమర్థించడం లేదని పేర్కొన్నారు.

TDP Leaders Protest Over Remand For CBN: చంద్రబాబు కోర్టు రిమాండ్​పై ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల రాస్తారోకోలు..

చంద్రబాబు త్వరగా బయటికి రావాలని కోరుకుంటూ... అనంతపురం జిల్లాలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు (Prayers for Chandrababu Release) చేసి.. 101 టెంకాయలు కొట్టారు. గుంతకల్లులో తెలుగుదేశం శ్రేణులు నోటికి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు. చంద్రబాబు విడుదల కావాలని కోరుకుంటూ.. కుప్పంలోని గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి దేవాలయంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబుకు మద్దతుగా ఈ నెల 17న విశాఖలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు అరెస్టు వార్త విని.. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం ముద్ధినాయన పల్లెలో గుండె ఆగి చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని టీడీపీ నేతలు పరామర్శించి.. ఆర్థిక సాయం అందించారు.

TDP Leaders Protest in AP: చంద్రబాబు అరెస్టుపై భగ్గుమన్న ప్రజలు.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు..

ABOUT THE AUTHOR

...view details