Telangana TDP Leaders Protest Against Chandrababu Arrest : తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu Arrest) అక్రమ అరెస్టును ఖండిస్తూ.. గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్లో సీనియర్ సిటిజన్ వాకర్స్ ఆధ్వర్యంలో అభిమానులు(Telangana TDP Leaders) నిరసన చేపట్టారు. బొటానికల్ గార్డెన్లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనను అడ్డుకోవటంపై పోలీసులను ప్రశ్నించటంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వారిని స్టేషన్‌కు తరలించారు.
TDP Leaders Protest in Telangana :చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ.. మోతీ నగర్లో రాజీవ్ నగర్ కాలనీ వాసులు నిరసన చేపట్టారు. తెలుగుదేశం అభిమానులు కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 'సైకో పోవాలి సైకిల్ రావాలి' అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం అభిమానులు... ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు.
ఆంధ్రప్రదేశ్ జగన్ సైకోతనంతో రాష్ట్రం పతన వ్యవస్థకు దారితీసిందని.. ముఖ్యమంత్రి జగన్‌కు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు. చంద్రబాబు కడిగిన ముత్యంవలే బయటకి వస్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తప్పక ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అభిమానులు(TDP Leaders in Telangana) పెద్ద ఎత్తున పాల్గొని.. చంద్రబాబు అరెస్టుపై నిరసన వ్యక్తం చేశారు.
TDP Leaders Protest in Telangana : ఏపీలో చంద్రబాబు అరెస్ట్.. తెలంగాణలో భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు
Hyderabad IT Professionals Protest Chandrababu Arrest :చంద్రబాబు నాయుడుకు మద్దతుగా.. హైదరాబాద్ ఐటీ ప్రొఫెషనల్స్(Hyderabad IT Professional) ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. చంద్రబాబు సురక్షితంగా బయటకు రావాలని.. బాచుపల్లిలో సుదర్శన లక్ష్మి గండభేరుండ నరసింహ మహాచండి మృత్యుంజయ కార్యసిద్ధి హోమం జరిపారు. కొల్లూరి కృష్ణమూర్తి, కోటేశ్వరి దంపతుల నేతృత్వంలో కౌసల్య గార్డెన్స్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 32 మంది వేద పండితుల చేత యాగాలను జరిపించారు. (Babutho Memu) 'బాబుతో మేము' సంతకాల సేకరణ కార్యక్రమంలో ఐటీ ఉద్యోగులు, చిన్నారులు పాల్గొన్నారు.