TDP Leaders Performed Pujas for Chandrababu: చంద్రబాబు త్వరగా విడుదల కావాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబు కోసం మేము సైతం అంటూ నినదించారు. చంద్రబాబు అరెస్టుఅక్రమమని నేతలు ఆరోపించారు. తమ అధినేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Guntur District..గుంటూరు జిల్లా పొన్నూరులో చేపట్టిన రిలే నిరాహారదీక్షలో ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు.
Visakhapatnam..విశాఖలో చంద్రబాబు విడుదలవ్వాలని కోరుతూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నగరంలోని వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక పూజలు చేశారు.
YSR Kadapa District.. వైఎస్సార్ కడప జిల్లాలో కడప శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు 101 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. జమ్మలమడుగులో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఎర్రగుంట్ల మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. కడప పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణరెడ్డి, శివనాథరెడ్డి, సీపీఐ నాయకులు దీక్షకు సంఘీభావం తెలిపారు.
IT Employees Car Rally in Hyderabad : చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ
Srikakulam District..శ్రీకాకుళం జిల్లాలోచంద్రబాబు తర్వగా విడుదలకావాలని నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి ఆధ్వర్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఎచ్చెర్లలో మాజీ మంత్రి కళా వెంకట్రావు ఆధ్యర్యంలో ర్యాలీ చేపట్టారు, శివాలయంలో 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Anakapalli District..అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక వేంకన్న ఆలయంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు టెంకాయలు కొట్టి మొక్కుకున్నారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొలేక అక్రమ అరెస్టు చేశారని అనిత మండిపడ్డారు.
West Godavari District.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ రామ్మోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని.. తర్వగా జైలు నుంచి విడుదల కావాలని పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
East Godavari District..తూర్పుగోదావరి జిల్లా అనపర్తి దీక్షా శిబిరంలో వినూత్నంగా నిరసన తెలిపారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆ పార్టీ శ్రేణులతో కలిసి కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్లపై బైఠాయించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.