TDP Leaders in Kanthi Tho Kranthi: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ... మరో వినూత్న ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 'కాంతితో క్రాంతి' పేరుతో.. రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు లైట్లు ఆఫ్ చేసి... దీపాలు వెలిగించి నిరసన తెలపాలన్న టీడీపీ అధిష్టానం పిలుపు.. విజయవంతం అయ్యింది. ఇళ్ల బయట, వాకిళ్లు, వీధుల్లో దీపాలు, మొబైల్ టార్చ్, కొవ్వొత్తులు, రోడ్డుపై ఉన్నవారు వాహనాల లైట్లు బ్లింక్ చేస్తూ... తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలకు రోడ్లపై వచ్చారు. సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ డెమోక్రసీ.. అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.
TDP Rally in Guntur: పోలీసుల ఆంక్షలను దాటుకుని.. శాంతి ర్యాలీని విజయవంతం చేసిన టీడీపీ, జనసేన, సీపీఐ
దిల్లీ నుంచి గల్లీ వరకు నిరసనలు: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. టీడీపీ నేతలు చేపట్టిన 'కాంతితో క్రాంతి' కార్యక్రమం విజయవంతమైంది. వైసీపీ విధానాలను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి నిరసన తెలిపారు. మొబైల్ టార్చ్, దీపాలు, కొవ్వొత్తులు, ఇళ్ల బయట, వాకిళ్లు, వీధుల్లో దీపాలు వెలిగించిన నిరసన తెలిపారు. రోడ్లపై వాహనాల లైట్లు బ్లింక్ చేస్తూ నిరసనలో పాల్గొన్నారు. నారా భువనేశ్వరి రాజమహేంద్రవరంలో దీపాలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. చంద్రబాబుకు సంఘీభావంగా లోకేశ్, గల్లా జయదేవ్, రఘురామ... దిల్లీలో దీపాలు వెలిగించారు. ఏపీలోని ఎన్టీఆర్ భవన్ వద్ద దీపాలు వెలిగించిన అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్, బెంగళూరులో తదితర ప్రాంతాల్లో దీపాలు వెలిగించి చంద్రబాబుపై అభిమానాన్ని చాటుకున్నారు.