తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Live Updates : టీడీపీ నాయకుల నిరాహార దీక్షలు.. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. - నారా లోకేష్‌ ఒకరోజు దీక్ష

tdp_leaders_hunger_strike_against_Chandrababu_arrest
tdp_leaders_hunger_strike_against_Chandrababu_arrest

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 9:03 AM IST

Updated : Oct 2, 2023, 5:35 PM IST

17:34 October 02

దిల్లీలో దీక్ష విరమించిన నారా లోకేష్‌, తెదేపా ఎంపీలు

  • దిల్లీలో దీక్ష విరమించిన నారా లోకేష్‌, తెదేపా ఎంపీలు
  • లోకేష్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన చిన్నారులు
  • స్కిల్‌ కేంద్రాల్లో శిక్షణ పొందిన 80 వేలమందికి ఉద్యోగాలు వచ్చాయి: లోకేష్‌
  • వైకాపా ప్రభుత్వం వచ్చినరోజు నుంచి మాపై అక్రమ కేసులు పెడుతున్నారు: లోకేష్‌
  • చంద్రబాబును జైలుకు పంపాలని కుయుక్తులు పన్నారు.. పంపారు..: లోకేష్‌
  • రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నేతను ఇబ్బంది పెడుతున్నారు: లోకేష్‌
  • చంద్రబాబుకు మద్దతుగా మొన్న ప్రజలంతా మోత మోగించారు: లోకేష్‌
  • ఇంకా అరెస్టులు ఉంటాయని చెబుతున్నారు: నారా లోకేష్‌
  • మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న వారిపై కేసులు దారుణం: లోకేష్‌
  • న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది: నారా లోకేష్‌

17:33 October 02

నా తండ్రి, భర్త అధికారంలో ఉన్నా ఎప్పుడూ అవినీతి చేయలేదు: భువనేశ్వరి

  • రాజమహేంద్రవరంలో దీక్ష విరమించిన భువనేశ్వరి
  • దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: భువనేశ్వరి
  • రాష్ట్ర ప్రజల బాగు కోసమే దీక్షలో పాల్గొన్నా: భువనేశ్వరి
  • స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన గాంధీజీనే జైలులు పెట్టారు: భువనేశ్వరి
  • కుటుంబానికి కొంత సమయం కేటాయించాలని చంద్రబాబును కోరేదాన్ని: భువనేశ్వరి
  • ఎప్పుడూ ప్రజల బాగు కోసమే చంద్రబాబు పరితపించారు: భువనేశ్వరి
  • నా ఆయుష్షు కూడా పోసుకుని చంద్రబాబు జీవించాలి: భువనేశ్వరి
  • నా తండ్రి, భర్త అధికారంలో ఉన్నా ఎప్పుడూ అవినీతి చేయలేదు: భువనేశ్వరి
  • ప్రభుత్వ నిధులను మేం ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు: భువనేశ్వరి

16:58 October 02

రాజకీయ జీవితంలో తప్పు చేయని వ్యక్తి.. చంద్రబాబు: అచ్చెన్న

  • రాజకీయ జీవితంలో తప్పు చేయని వ్యక్తి.. చంద్రబాబు: అచ్చెన్న
  • చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు: అచ్చెన్న
  • చంద్రబాబు త్వరలోనే జైలునుంచి బయటకు వస్తారు: అనిత
  • చంద్రబాబు బయటకు వచ్చి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు: అనిత

16:57 October 02

దీక్ష వల్ల చంద్రబాబుకు ఇవాళ భోజనం పంపని కుటుంబసభ్యులు

రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబు రిలే నిరాహార దీక్ష
దీక్ష వల్ల చంద్రబాబుకు ఇవాళ భోజనం పంపని కుటుంబసభ్యులు

16:41 October 02

చంద్రబాబు, లోకేష్‌, పవన్ యాత్రలతో జగన్‌కు భయం పట్టుకుంది: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • చంద్రబాబు, లోకేష్‌, పవన్ యాత్రలతో జగన్‌కు భయం పట్టుకుంది: బుచ్చయ్య
  • ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
  • నష్టపోయింది చంద్రబాబు కాదు.. తెలుగుజాతి..: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
  • చంద్రబాబును కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుజాతిపై ఉంది: బుచ్చయ్య

16:08 October 02

ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద నందమూరి సుహాసిని దీక్ష విరమణ

  • ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద నందమూరి సుహాసిని దీక్ష విరమణ
  • నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన తెదేపా నేత టీడీ జనార్దన్
  • అనంతరం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సుహాసిని
  • చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నందమూరి సుహాసిని దీక్ష

15:17 October 02

చంద్రబాబుకు మద్దతుగా ఎన్టీఆర్ ఘాట్‌లో సుహాసిని దీక్ష... మద్దతు తెలిపిన నటుడు మురళీమోహన్

  • చంద్రబాబుకు మద్దతుగా ఎన్టీఆర్ ఘాట్‌లో సుహాసిని దీక్ష
  • హైదరాబాద్‌: సుహాసిని దీక్షకు మద్దతు తెలిపిన నటుడు మురళీమోహన్
  • అద్భుత రాజధాని కోసం చంద్రబాబు ఆలోచించారు: మురళీమోహన్‌
  • రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా 35 వేల ఎకరాలు ఇచ్చారు: మురళీమోహన్‌
  • ఐటీ కంపెనీలు చంద్రబాబు తీసుకురావడం వల్లే యువతకు ఉపాధి లభించింది: మురళీమోహన్‌
  • ఇప్పుడు ఏపీలో కొత్త పరిశ్రమలు కాదు.. ఉన్నవే వెళ్లిపోతున్నాయి: మురళీమోహన్‌
  • రాష్ట్రం కోసం చంద్రబాబు నిరంతరం ఆలోచించేవారు: మురళీమోహన్‌
  • ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబును జైలుకు పంపడం బాధాకరం: మురళీమోహన్‌

14:16 October 02

పోలీసులకు బండారు సత్యనారాయణమూర్తి సతీమణి ఫిర్యాదు

  • పరవాడ పోలీసుస్టేషన్‌లో బండారు సత్యనారాయణమూర్తి సతీమణి మాధవీలత ఫిర్యాదు
  • రాత్రి నుంచి తమను పోలీసులు నిర్బంధించారంటూ బండారు సతీమణి ఫిర్యాదు
  • ఏ నోటీసు ఇవ్వకుండా రాత్రి నుంచి గృహనిర్బంధం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు

13:57 October 02

అద్భుత రాజధాని కోసం చంద్రబాబు ఆలోచించారు: మురళీమోహన్‌

  • అద్భుత రాజధాని కోసం చంద్రబాబు ఆలోచించారు: మురళీమోహన్‌
  • రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా 35 వేల ఎకరాలు ఇచ్చారు: మురళీమోహన్‌
  • ఐటీ కంపెనీలు చంద్రబాబు తీసుకురావడం వల్లే యువతకు ఉపాధి లభించింది: మురళీమోహన్‌
  • ఇప్పుడు ఏపీలో కొత్త పరిశ్రమలు కాదు.. ఉన్నవే వెళ్లిపోతున్నాయి: మురళీమోహన్‌
  • రాష్ట్రం కోసం చంద్రబాబు నిరంతరం ఆలోచించేవారు: మురళీమోహన్‌
  • ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబును జైలుకు పంపడం బాధాకరం: మురళీమోహన్‌

13:57 October 02

ఎన్టీఆర్ ఘాట్‌లో సుహాసిని దీక్ష

  • చంద్రబాబుకు మద్దతుగా ఎన్టీఆర్ ఘాట్‌లో సుహాసిని దీక్ష
  • హైదరాబాద్‌: సుహాసిని దీక్షకు మద్దతు తెలిపిన నటుడు మురళీమోహన్

13:56 October 02

  • నరసరావుపేట తెదేపా కార్యాలయం వద్ద 20వ రోజు రిలే నిరాహారదీక్ష
  • దీక్షలో పాల్గొన్న జీవీ ఆంజనేయులు, చదలవాడ అరవిందబాబు
  • చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా సంకెళ్లు ధరించి దీక్షలో పాల్గొన్న నేతలు
  • శాంతియుతంగా పోరాడుతుంటే అక్రమ కేసులు పెడుతున్నారు: జీవీ ఆంజనేయులు
    రాజారెడ్డి రాజ్యాంగానికి త్వరలోనే ముగింపు: జీవీ ఆంజనేయులు

13:35 October 02

తెదేపా కోసం ఎంత దూరమైనా వెళ్తాం: భూమా అఖిలప్రియ

  • తెదేపా కోసం ఎంత దూరమైనా వెళ్తాం: భూమా అఖిలప్రియ
  • ఎప్పుడూ లేని సంస్కృతి రాష్ట్రంలో కొనసాగుతోంది: అఖిలప్రియ
  • నంద్యాల నుంచే వైకాపా పతనమయ్యేలా పనిచేస్తాం: అఖిలప్రియ

13:35 October 02

  • నారా లోకేష్ దీక్షకు మద్దతు తెలిపిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు

13:19 October 02

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద ఉద్రిక్తత

  • మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద ఉద్రిక్తత
  • అనకాపల్లి: వెన్నెలపాలెంలోని బండారు ఇంటికి చేరుకున్న గణబాబు
  • అనకాపల్లి: ఇంట్లోకి వెళ్లేందుకు గణబాబును అనుమతించని పోలీసులు
  • పోలీసులు అనుమతించకపోవడంతో వెనుదిరిగిన ఎమ్మెల్యే గణబాబు
  • ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు యత్నించిన తెదేపా కార్యకర్తలు
  • అనకాపల్లి: పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట
  • అనకాపల్లి: తెదేపా కార్యకర్తలను లాఠీలతో చెదరగొట్టిన పోలీసులు

12:19 October 02

నా తండ్రి ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ఇవాళ నా హృదయం నిండిపోయింది: భువనేశ్వరి

  • నా తండ్రి ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ఇవాళ నా హృదయం నిండిపోయింది: భువనేశ్వరి
  • సత్యం ఎంత కఠినంగా ఉన్నా కట్టుబడి ఉండాలని ఎన్టీఆర్ మనకు బోధించారు: భువనేశ్వరి
  • న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తి: భువనేశ్వరి
  • తెలుగు జాతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానటుడు ఎన్టీఆర్: భువనేశ్వరి

12:04 October 02

జగన్‌పై నాకు వ్యక్తిగత ద్వేషం లేదు: పవన్‌కల్యాణ్‌

  • అవినీతి, దౌర్జన్యంతో కష్టాన్ని, శ్రమను దోచుకుంటున్నారు: పవన్‌
  • దోపిడీ, అవినీతికి అడ్డుకట్ట వేయాలి: పవన్‌కల్యాణ్‌
  • జనసేన ప్రభుత్వం వచ్చాక గాంధీ జయంతిని బందర్‌లో‌ చేసుకుందాం: పవన్‌
  • రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉండటం సహజం: పవన్‌కల్యాణ్‌
  • జగన్ మాదిరిగా కేసులు పెట్టి, జైళ్లకు పంపే ఆలోచన సరికాదు: పవన్‌
  • జగన్‌పై నాకు వ్యక్తిగత ద్వేషం లేదు: పవన్‌కల్యాణ్‌
  • జగన్ ఆలోచన, పాలన నిర్ణయాలను వ్యతిరేకించా: పవన్‌
  • గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం చంపేసింది: పవన్‌కల్యాణ్‌
  • రాజకీయాల్లో బురద పడుతుందని తెలుసు.. అయినా ముందుకే సాగుతాం: పవన్‌

12:03 October 02

బండారు సత్యనారాయణమూర్తి దీక్ష.. వెన్నెలపాలెంలోని నివాసంలో

అనకాపల్లి: వెన్నెలపాలెంలోని నివాసంలో బండారు సత్యనారాయణమూర్తి దీక్ష

దీక్షకు సంఘీభావం ప్రకటించిన గంటా శ్రీనివాసరావు, దువ్వారపు రామారావు

దీక్షలో పాల్గొన్న బుద్ధ నాగ జగదీష్, పల్లా శ్రీనివాసరావు, పీలా సత్యనారాయణ

11:40 October 02

రెండు గంటల పాటు పవన్‌కల్యాణ్‌ మౌన దీక్ష

  • మచిలీపట్నం సువర్ణ కల్యాణ మండపంలో పవన్‌కల్యాణ్‌ దీక్ష
  • గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పవన్‌
  • పవన్‌తో పాటు సంఘీభావంగా దీక్షలో‌ పాల్గొన్న జనసేన నేతలు
  • రెండు గంటల పాటు మౌన దీక్ష చేసిన జనసేన అధినేత పవన్‌
  • రాష్ట్రంలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పవన్ దీక్ష
  • కృష్ణా జిల్లా జనసేన పార్టీ కార్యవర్గ సభ్యులతో సమావేశం కానున్న పవన్
  • సా. 5 గం.కు కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలతో పవన్‌ సమావేశం

11:39 October 02

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఒంగోలులో సత్యమేవ జయతే దీక్ష

  • చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఒంగోలులో సత్యమేవ జయతే దీక్ష
  • ఒంగోలులో దీక్షలో పాల్గొన్న తెదేపా, జనసేన, వామపక్షాల నేతలు
  • దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, ఇతర నేతలు
  • ప్రకాశం: కొండపిలో దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి

11:10 October 02

రాష్ట్రంలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పవన్ మౌనదీక్ష

  • మచిలీపట్నం సువర్ణ కల్యాణ మండపానికి వచ్చిన పవన్‌కల్యాణ్‌
  • గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పవన్‌కల్యాణ్‌
  • రాష్ట్రంలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పవన్ మౌనదీక్ష
  • పవన్‌తో పాటు సంఘీభావంగా దీక్షలో‌ పాల్గొన్న జనసేన నేతలు
  • రెండు గంటల పాటు పవన్‌కల్యాణ్‌ మౌనదీక్ష
  • కృష్ణా జిల్లా జనసేన పార్టీ కార్యవర్గ సభ్యులతో సమావేశం కానున్న పవన్
  • సా. 5 గం.కు కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలతో పవన్‌ సమావేశం

11:09 October 02

చంద్రబాబుకు మద్దతుగా ఎన్టీఆర్ ఘాట్‌లో సుహాసిని దీక్ష

  • చంద్రబాబుకు మద్దతుగా ఎన్టీఆర్ ఘాట్‌లో సుహాసిని దీక్ష
  • హైదరాబాద్‌: సుహాసినితో పాటు దీక్షలో పాల్గొన్న పనబాక లక్ష్మి
  • అక్రమ కేసులు ఎత్తివేయాలని తెదేపా కార్యకర్తల నినాదాలు
  • సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేసిన తెదేపా

11:09 October 02

ఎన్టీఆర్‌ కుటుంబసభ్యుల నిరాహార దీక్ష

  • హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఎన్టీఆర్‌ కుటుంబసభ్యుల నిరాహార దీక్ష
  • హైదరాబాద్‌: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎన్టీఆర్‌ కుటుంబసభ్యుల దీక్ష
  • హైదరాబాద్‌: ఎన్టీఆర్ ఘాట్‌లో నిరాహారదీక్షకు వచ్చిన నందమూరి సుహాసిని
  • చంద్రబాబు అరెస్టుకు నిరసనగా దీక్ష చేసేందుకు వచ్చిన సుహాసిని
  • దీక్షకు అనుమతి లేదని నందమూరి సుహాసినిని అడ్డుకున్న పోలీసులు

11:09 October 02

రాజమహేంద్రవరం క్వారీ సెంటర్ వద్ద భువనేశ్వరి నిరశన దీక్ష

  • రాజమహేంద్రవరం క్వారీ సెంటర్ వద్ద భువనేశ్వరి నిరశన దీక్ష
  • సాయంత్రం 5 వరకు దీక్ష కొనసాగించనున్న నారా భువనేశ్వరి
  • 'సత్యమేవ జయతే' పేరిట నారా భువనేశ్వరి నిరశన దీక్ష
  • రాజమహేంద్రవరం కంబాలచెరువు వద్ద గాంధీ విగ్రహానికి భువనేశ్వరి నివాళులు

10:23 October 02

దిల్లీలో నారా లోకేశ్​ ఒకరోజు దీక్ష

  • దిల్లీలో నారా లోకేష్‌ ఒకరోజు దీక్ష
  • గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన లోకేష్‌
  • చంద్రబాబు దీక్షకు మద్దతుగా దిల్లీలో లోకేష్‌ దీక్ష
  • ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ నివాసంలో లోకేష్‌ దీక్ష
  • సత్యమేవ జయతే పేరుతో దిల్లీలో లోకేష్‌ నిరాహార దీక్ష
  • లోకేష్‌తో పాటు దీక్షలో కూర్చున్న తెదేపా ఎంపీలు, నేతలు

10:22 October 02

  • సైకో జగన్‌ ఫ్యాక్షన్‌ పాలనలో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు: లోకేష్‌
  • రాజ్యాంగాన్ని కాలరాశారు, సత్యాన్ని వధించారు: ట్విటర్‌లో లోకేష్‌
  • తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు: లోకేష్‌
  • అరాచకాలను నిరసిస్తూ దీక్ష చేసి చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నా: లోకేష్‌

10:22 October 02

మంగళగిరిలో అచ్చెన్నాయుడు రిలే నిరాహారదీక్ష

  • మంగళగిరిలో అచ్చెన్నాయుడు రిలే నిరాహార దీక్ష
  • సత్యమేవ జయతే పేరిట సాయంత్రం 5 వరకు నిరశన దీక్ష
  • చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ తెదేపా నాయకుల దీక్షలు
  • ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి దీక్షకు కూర్చున్న అచ్చెన్న

10:21 October 02

చంద్రబాబు అరెస్టు వార్తలు చూశారని కూడా కేసు పెట్టేలా ఉన్నారు: లోకేష్‌

  • విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మందిపై కేసా?: నారా లోకేష్‌
  • టీవీలో చంద్రబాబు అరెస్టు వార్తలు చూశారని కూడా కేసు పెట్టేలా ఉన్నారు: లోకేష్‌
  • పసుపు రంగు దుస్తులు కట్టుకున్నారని కూడా కేసు పెడతారా?: నారా లోకేష్‌
  • ఆదేశాలు ఇచ్చినోళ్లకు సరే.. అమలు చేసేవారికి కూడా తెలియదా?: లోకేష్‌

08:55 October 02

బస్సుయాత్ర ఆలోచనలో భువనేశ్వరి.. నేడే ప్రకటనకు ఆవకాశం..

  • చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా భువనేశ్వరి బస్సుయాత్ర ఆలోచన
  • ఈనెల 5న కుప్పం నుంచి బస్సుయాత్ర ప్రారంభించే యోచనలో భువనేశ్వరి
  • బస్సుయాత్రపై నేడు ప్రకటన చేసే అవకాశం

08:54 October 02

బండారు సత్యనారాయణపై గుంటూరు నగరంపాలెం పీఎస్‌లో కేసు నమోదు

  • మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై గుంటూరు నగరంపాలెం పీఎస్‌లో కేసు
  • మంత్రి రోజాపై వ్యక్తిగత దూషణలు చేశారని వైకాపా కార్యకర్త ఫిర్యాదు
  • వైకాపా కార్యకర్త మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు
  • వైకాపా నేతల ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం కేసు నమోదు
  • బండారు సత్యనారాయణపై ఐపీసీ సెక్షన్ 153ఏ, 504, 354ఏ కింద కేసు
  • 505, 506, 509, 499, ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసు నమోదు

08:54 October 02

మంగళగిరిలో అచ్చెన్నాయుడు దీక్ష

  • చంద్రబాబుకు మద్దతుగా మంగళగిరిలో అచ్చెన్నాయుడు, షరీఫ్‌ దీక్ష

08:53 October 02

బండారు సత్యనారాయణ ఇంటి చుట్టూ పోలీసుల మోహరింపు

  • విశాఖ: బండారు సత్యనారాయణ ఇంటి చుట్టూ పోలీసుల మోహరింపు
  • వెన్నెలపాలెంలో బండారు సత్యనారాయణమూర్తి ఇంటి పరిసరాల్లో భారీగా పోలీసులు
  • విశాఖ: డీఎస్పీ నేతృత్వంలో భారీగా మోహరించిన పోలీసులు
  • విశాఖ: పరవాడ కూడలి, పరవాడ కాలేజీ సెంటర్‌లో బారికేడ్లు ఏర్పాటు

08:53 October 02

జైలులో నేడు చంద్రబాబు నిరశన దీక్ష

  • రాజమహేంద్రవరం జైలులో నేడు చంద్రబాబు నిరశన దీక్ష
  • అక్రమ అరెస్టును నిరసిస్తూ జైలులో చంద్రబాబు నిరశన దీక్ష

08:53 October 02

రాజమహేంద్రవరంలో భువనేశ్వరి నిరసన దీక్ష

  • రాజమహేంద్రవరం క్వారీ సెంటర్ వద్ద భువనేశ్వరి నిరసన దీక్ష
  • ఉ.10 నుంచి సా.5 వరకు నారా భువనేశ్వరి నిరసన దీక్ష
  • గాంధీ జయంతి సందర్భంగా 'సత్యమేవ జయతే' పేరిట భువనేశ్వరి నిరశన దీక్ష
  • నిరశన దీక్షలో సుమారు 8వేల మంది మహిళలు పాల్గొంటారని అంచనా

08:52 October 02

కడపలో భారీ ర్యాలీ

  • నేడు చంద్రబాబు దీక్షకు మద్దతుగా కడపలో భారీ ర్యాలీ
  • కడప: బలిజ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

08:52 October 02

దిల్లీలో లోకేశ్​ ఒకరోజు దీక్ష

  • నేడు దిల్లీలో ఒకరోజు దీక్ష చేపట్టనున్న నారా లోకేష్‌
  • చంద్రబాబు దీక్షకు మద్దతుగా దిల్లీలో దీక్ష చేపట్టనున్న లోకేష్‌
  • ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ నివాసంలో లోకేష్‌ దీక్ష

08:51 October 02

రాత్రి వరండాలో కొవ్వొత్తులతో నిరసన..

  • నేడు ప్రతి ఇంట్లో దీపాలు ఆర్పేసి, వరండాలో కొవ్వొత్తులతో నిరసన
  • రాత్రి 7 నుంచి 7.05 వరకు దీపాలు ఆర్పేసి, వరండాలో కొవ్వొత్తులతో నిరసన

08:33 October 02

Live Updates : నేడు రాష్ట్రవ్యాపంగా టీడీపీ శ్రేణుల నిరాహార దీక్షలు

  • నేడు రాష్ట్రవ్యాపంగా టీడీపీ శ్రేణుల నిరాహార దీక్షలు
  • చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్షలు
  • గాంధీ స్ఫూర్తితో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు దీక్ష
Last Updated : Oct 2, 2023, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details