తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పొలిట్ బ్యూరోలో కీలక అంశాలపై చర్చ.. ఎన్టీఆర్ శతజయంతి పండుగపై ప్రత్యేక దృష్టి

TDP Polit Bureau meeting : ఎన్టీఆర్ శతజయంతి వేడుకల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశ, విదేశాల్లో వంద సభలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అధ్యక్షతన సాగిన పొలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ రెండు రాష్ట్రాల అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 17 అంశాలపై సమావేశంలో చర్చించి పలు తీర్మానాలు చేశారు.

పొలిట్ బ్యూరో
పొలిట్ బ్యూరో

By

Published : Mar 28, 2023, 8:37 PM IST

Updated : Mar 29, 2023, 6:27 AM IST

TDP Polit Bureau meeting : ఎన్టీఆర్ శతజయంతి వేడుకల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశ, విదేశాల్లో వంద సభలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అధ్యక్షతన చేపట్టిన పొలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ మేనిఫెస్టో రూపకల్పనను ప్రధాన అజెండాగా చర్చించడంతోపాటు... మహానాడు నిర్వహణ, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు అండగా ఉండాలని, శాశ్వత సభ్యత్వం వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చించి తీర్మానించినట్టు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తం 17 అంశాలపై దాదాపు రెండు గంటల పాటు చర్చించిన అనంతరం మూడు ప్రధాన కమిటీలను సైతం ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు.

పొలిట్ బ్యూరో

చంద్రబాబు అధ్యక్షతన... ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అధ్యక్షతన సాగిన పొలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ రెండు రాష్ట్రాల అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొన్నారు. సుమారు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం మూడు గంటల పాటు సాగింది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 17 అంశాలపై సమావేశంలో చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఎన్నికల ఏడాదిలో నిర్వహించిన సమావేశం కావడంతో ప్రధానంగా ఆచరణ యోగ్యమైన మేనిఫెస్టో రూపకల్పన, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల నిర్వహణను ప్రధాన ఎజెండాగా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి.

ప్రజామోదయోగ్యమేన మేనిఫెస్టో... ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి యువగళం కార్యక్రమం విజయవంతం చేయడం, జీవో నెంబర్ 1పై సమావేశంలో చర్చించి తీర్మానం చేశారు. ముఖ్యంగా ప్రజలకు ఆమోదయోగ్యమైన మేనిఫెస్టో రూపొందించాలని తీర్మానించడంతోపాటు.. ఇందుకోసం ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు ప్రత్యేకంగా కమిటీని సైతం ఏర్పాటు చేస్తూ తీర్మానంలో పేర్కొన్నారు. ఇక ఏపీలో అకాలవర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు సాయం చేయడంలో వైఫల్యం చెందిందంటూ రైతులకు భరోసాగా నిలవాలని తీర్మానించినట్టు స్పష్టం చేశారు. ఏపీలో బాదుడే బాదుడు.. కార్యక్రమానికి కొనసాగింపుగా ఇదేం ఖర్మ.. కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించినట్టు తెలిపారు.

పార్టీలోకి 40 మంది ఎమ్మెల్యేలు... ఈ సందర్భంగా మాట్లాడిన ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు... ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. సీఎం జగన్ పది లక్షల కోట్ల అప్పులు చేశారన్న ఆయన... లక్షా 25వేల కోట్ల పన్నులు ప్రజల నుంచి వసూలు చేశారని ఆ మొత్తం ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలు జీతాల కోసం పోరాడాల్సిన దుస్థితి వచ్చిందన్న అచ్చెన్నాయుడు.. ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని వంద రూపాయల నాణెం తీసుకువస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశామన్నారు. ఇక రాజకీయంగా ఏపీలో నెలకొన్న అంశాలపై మాట్లాడిన అచ్చెన్నాయుడు 40 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో కి వస్తామని కోరుతున్నారని వెల్లడించారు.

రెండు నెలల్లో 100 సభలు... ఎన్టీఆర్ శతయంతి వేడుకల నిర్వహణపై ప్రధానంగా చర్చించినట్టు పోలిట్ బ్యూరో సభ్యులు వివరించారు. ముఖ్యంగా మే 28లోపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాలు, దేశ విదేశాల్లో తెలుగుదేశం అభిమానుల ఆధ్వర్యంలో మొత్తం 100 సభలు నిర్వహించాలని తీర్మానించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని సైతం ఏర్పాటు చేస్తూ తీర్మానంలో పేర్కొన్నారు. మే నెలలో రాజమండ్రిలో నిర్వహించనున్న మహానాడు కోసం మరో కమిటీని కమిటీని ఏర్పాటు చేస్తూ తీర్మానాలు చేశారు.

5వేల రూపాయలతో శాశ్వత సభ్యత్వం... తెలంగాణలో ఆవిర్భావ సభ నిర్వహణ సహా... అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు అండగా ఉండాలని చర్చించినట్టు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమం వేగవంతం చేయాలనే అంశాలపై చర్చించినట్టు స్పష్టం చేశారు. వీటితోపాటు... పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం, 5 వేల రూపాయలకు శాశ్వత సభ్యత్వం అందించాలని తీర్మానించినట్టు వివరించారు. టీడీపీని ఇంటింటికి తీసుకువెళ్లి పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయనున్నట్టు కాసాని తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడిన పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి.. రెండు రాష్ట్రాల ప్రజల సమస్యలు, విభజన హామీలు నెలబెట్టుకునే అంశాలకు సంబంధించి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించామన్నారు.

సుదీర్ఘ కాలం తర్వాత జరిగిన ఈ పోలిట్ బ్యూరో సమావేశంలో ప్రధానంగా పార్టీ బలోపేతం సహా అధికార పక్షాల వైఫల్యాలను ఎండగట్టేలా కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల ముగింపు సైతం చరిత్రలో నిలిచిపోయేలా ఉండేలా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ప్రకటించింది.

ఇవీ చదవండి :

Last Updated : Mar 29, 2023, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details