తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Ex MLA Kothakota dayakar reddy Passes Away : మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూత - మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూత

TDP Ex MLA Kothakota dayakar reddy
TDP Ex MLA Kothakota dayakar reddy

By

Published : Jun 13, 2023, 6:59 AM IST

Updated : Jun 13, 2023, 11:24 AM IST

06:54 June 13

TDP Ex MLA Kothakota dayakar reddy Passes Away : మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూత

Ex MLA Kothakota dayakar reddy Passes Away :తెలుగుదేశం సీనియర్ నాయకుడు.. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ ​రెడ్డి ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. 4 నెలలుగా కాన్సర్​తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్​లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. దయాకర్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు.

TDP Ex MLA Kothakota dayakar reddy Passed Away : దయాకర్​రెడ్డి స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కపురం. వెంకట కృష్ణారెడ్డి-పద్మావతమ్మ దంపతులకు దయాకర్​రెడ్డి 1953 ఆగస్టు 18న జన్మించారు. అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన దయాకర్​రెడ్డి 1985లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1989లో అమరచింత నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి 1994,1999లో పోటీ చేసి గెలుపొందారు.

నియోజకవర్గ పునర్విభజనలో ఆయన 2004లో మక్తల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2009లో మక్తల్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అదే ఎన్నికల్లో దయాకర్​రెడ్డి సతీమణి సీతా దయాకర్​రెడ్డి సైతం దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయబావుటా ఎగుర వేశారు. అంతకుముందు ఆమె 2002లో మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్​గా సేవలందించారు. 2014లో మక్తల్ నియోజకవర్గం నుంచే దయాకర్​రెడ్డి తిరిగి బరిలోకి దిగినా విజయాన్ని అందుకోలేక పోయారు.

Ex MLA Kothakota Dayakar Reddy News :తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత క్రమంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రెండు నియోజక వర్గాల్లోని ఆయన అభిమానులు, కార్యకర్తల సూచన మేరకు పార్టీ మారతారని ప్రచారం సాగినా చివరి వరకూ ఆయన తెలుగుదేశంలోనే కొనసాగారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన దయాకర్​రెడ్డి అప్పటి అమరచింత, ప్రస్తుతం మక్తల్, దేవరకద్ర నియోజక వర్గ అభివృద్ధిలో తనదైన ముద్రవేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధిలోనూ కీలక భూమిక పోషించారు.

ఆయన మరణంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. హైదరాబాద్ నుంచి ఆయన పార్ధివ దేహాన్ని స్వగ్రామమైన పర్కపురానికి తరలించారు. ఇవాళ సాయంత్రం అక్కడే దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, మరికొంత మంది తెలంగాణ నాయకులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే కుటుంబసభ్యులకు మనోధైర్యం కలిగించాలని అన్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా దయాకర్ రెడ్డి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 13, 2023, 11:24 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details