తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ACB court orders to arrange facilities for Chandrababu in jail చంద్రబాబుకు జైలులో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని.. ఏసీబీ కోర్టు ఆదేశాలు - Chandrababu Health Condition

Lawyers_Approached_Court_on_Chandrababu_Health
ACB court orders to arrange facilities for Chandrababu in jail చంద్రబాబుకు జైలులో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని.. ఏసీబీ కోర్టు ఆదేశాలు

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 7:37 PM IST

Updated : Oct 15, 2023, 6:12 AM IST

19:34 October 14

విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాదులు

ACB court orders to arrange facilities for Chandrababu in jail చంద్రబాబుకు జైలులో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని.. ఏసీబీ కోర్టు ఆదేశాలు

Lawyers Approached Court on Chandrababu Health: టీడీపీ అధినేత చంద్రబాబుకు జైలులో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని.. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత రెండు రోజుల వైద్య నివేదికలను పరిగణలోకి తీసుకుని.. చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు అనారోగ్యానికి జైలులో పరిస్థితులే కారణమని.. ప్రభుత్వ వైద్య బృదం ప్రకటించింది. వెంటనే ఉపశమన చర్యలు తీసుకోకపోతే.. బాబు ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందన్న నివేదకలపై.. చంద్రబాబు కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో బాబు తరుపు న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించగా.. చంద్రబాబుకు జైలులో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు బ్యారక్‌లో చల్లదనం ఉండేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. చంద్రబాబు బ్యారక్‌లో టవర్‌ ఏసీ ఏర్పాటు చేయాలని ఏసీబీ కోర్టు సూచనలు చేసింది.

ACB court orders to arrange facilities for Chandrababu in jail చంద్రబాబుకు జైలులో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని.. ఏసీబీ కోర్టు ఆదేశాలు

అంతకు ముందు చంద్రబాబు వ్యక్తిగత వైద్యుల సూచనలతో.. న్వాయవాదులు జయవాడ ఏసీబీ కోర్టులో శనివారం రాత్రి హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వెనువెంటనే విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించి.. జైలు సౌకర్యాలపై ఆదేశాలు జారీ చేశారు.

వైద్యుల నివేదిక మేరకే మెరుగైన వైద్యం అందించాలని న్యాయవాదులు పిటిషన్​లో కోర్టును కోరారు. ప్రభుత్వ వైద్యుల సూచనలను జైలు అధికారులు పాటించేలా చూడాలని న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు. చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలని వైద్యులు జైలర్​కు నివేదించారు.

Govt Doctors Report on Chandrababu Health Problems: చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ వైద్యుల కీలక నివేదిక

Last Updated : Oct 15, 2023, 6:12 AM IST

ABOUT THE AUTHOR

...view details