తెలంగాణ

telangana

ETV Bharat / bharat

TDP concern on New Central Jail Incharge Ravi Kiran చంద్రబాబు పట్ల కఠినంగా వ్యవహరించేందుకు రవికిరణ్‌ను తీసుకొచ్చారని ప్రచారం - Chandrababu in Rajahmundry Central Jail

TDP concern over appointing minister's relative as in-charge of CBN's jail ఏపీలోని రాజమహేంద్రవరం జైల్‌ సూపరింటెండెంట్ సెలవుపై వెళ్లిన తర్వాత.. కొత్తగా ఇన్ఛార్జ్‌ బాధ్యతలు చేపట్టిన రవికిరణ్ తీరుపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏపీ ఆర్థికమంత్రి సమీప బంధువైన వ్యక్తిని చంద్రబాబు ఉంచిన జైలుకు రప్పించడంపై పలు ఆరోపణలు గుప్పిస్తోంది.

TDP_Doubt_on_Rajamahendravaram_Central_Jail_Incharge_RaviKiranat
TDP_Doubt_on_Rajamahendravaram_Central_Jail_Incharge_RaviKiranat

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 8:47 AM IST

TDP concern over appointing minister's relative as in-charge of CBN's jail : ఏపీలోని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లిపోయిన తర్వాత.. ఆయన స్థానంలో ఇన్ఛార్జీ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన ఏపీ జైళ్ల శాఖ కోస్తాంధ్ర రీజియన్ డీఐజీ రవి కిరణ్.. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సమీప బంధువు. ప్రభుత్వ పెద్దలకూ ఆయన అత్యంత సన్నిహితుడు. సాధారణంగా జైలు సూపరింటెండెంట్ సెలవుపై వెళితే ఇన్ఛార్జీగా ఆ స్థాయి అధికారికి లేదా ఆ తర్వాత స్థానంలో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగిస్తారు. అలాంటిది డీఐజీ స్థాయి అధికారికి ఈ బాధ్యతలు ఇవ్వటంలో ఆంతర్యమేంటని తెలుగుదేశం ప్రశ్నిస్తోంది.?

DIG Ravi Kiran close relative to AP Finance Minister Buggana Rajendranath Reddy :అది కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆ కారాగారంలో రిమాండులో ఉన్న సమయంలో ఆకస్మికంగా ఈ పరిణామాలు జరగడంలో లోగుట్టు ఏంటన్న సందేహం వ్యక్తం చేస్తోంది. రవికిరణ్ వైసీపీకి అనుకూలంగా ఉంటారని, ఆయన గతంలో పని చేసిన చోటల్లా వారికి మేలు కలిగేలా వ్యవహరించేవారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌గా పనిచేసిన సమయంలో వివేకా హత్య కేసు నిందితులకు, ప్రధానంగా ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డికి రాచ మర్యాదలు చేశారన్న విమర్శలున్నాయి. అలాంటి అధికారిని చంద్రబాబును నిర్బంధించిన జైలు పర్యవేక్షక అధికారిగా నియమించటంపైటీడీపీ అనేక అనుమానాలను లేవనెత్తుతోంది.

Skill Development Case Updates: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఈనెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్‌

గురువారం నాడే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం బాధ్యతలు తీసుకున్న రవికిరణ్.. చంద్రబాబును శుక్రవారం నాడు ములాఖత్‌లో కలిసేందుకు ఆయన సతీమణి భువనేశ్వరి చేసుకున్న దరఖాస్తును తిరస్కరించారు. వారంలో రెండు సార్లే ములాఖత్‌కు అవకాశం ఉంటుందని అత్యవసరమైతే తప్ప మూడోసారి వీలుండదని పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Chandrababu Case Arguments in ACB Court: పోలీసులు నన్ను మానసికంగా వేధించారు.. వాహనంలో తిప్పుతూనే ఉన్నారు

చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 73 ఏళ్ల వయసు. అనేక అనారోగ్య సమస్యలూ ఉన్నాయి. అలాంటి ఆయన్ను కలిసేందుకు ఆయన భార్యకే ములాఖత్ నిరాకరించారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవొచ్చు. ఇలా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేయాలన్న ఉద్దేశంతోనే రవికిరణ్‌ను వ్యూహాత్మకంగా అక్కడ నియమించారనే వాదన వ్యక్తమవుతోంది. ఈ నెల 10న అర్ధరాత్రి తర్వాత చంద్రబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. ఆ తర్వాత రోజు అర్ధరాత్రి సమయంలో జైళ్ల శాఖ కోస్తాంధ్ర రేంజి డీఐజీ హోదాలో రవికిరణ్ రాజమహేంద్రవరం కారాగారాన్ని సందర్శించారు.

Ravi Kiran to Deal Harshly with Chandrababu : దాదాపు 2 గంటల పాటు కారాగారంలోనే రౌండ్లు వేశారు. డీఐజీ స్థాయి అధికారి అర్ధరాత్రి వేళ ఇలా జైల్లో ఎన్నడూ లేదని జైలు వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత 2 రోజులకే రాహుల్ సెలవుపై వెళ్లటం, ఆయన స్థానంలో రవికిరణ్ బాధ్యతలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబును ములాఖత్‌లో కలిసేందుకు వచ్చిన వారిని రాహుల్ తన ఛాంబర్లో కూర్చొబెట్టి మాట్లాడారని అందుకే ఆయన్ను సెలవుపై పంపించేసి చంద్రబాబు పట్ల కఠినంగా వ్యవహరించేందుకు, ఆయన్ను మానసికంగా కుంగదీసేందుకే రవికిరణ్‌ను తీసుకొచ్చారని ప్రచారం జరుగుతోంది.

Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ విచారణ.. ఈనెల 19కి వాయిదా

TDP concern on New Central Jail Incharge Ravi Kiran చంద్రబాబు పట్ల కఠినంగా వ్యవహరించేందుకు రవికిరణ్‌ను తీసుకొచ్చారని ప్రచారం

ABOUT THE AUTHOR

...view details