తెలంగాణ

telangana

ETV Bharat / bharat

TDP Chief Chandrababu Naidu Comments: 'నేను ఏ తప్పూ చేయలేదు.. ప్రజల అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను' - CHANDRABABU NEWS

TDP Chief Chandrababu Naidu Comments: కష్ట కాలంలో తెలుగు ప్రజలు చూపిన అభిమానం తాను ఎప్పటికీ మర్చిపోలేనని.. టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన పార్టీ శ్రేణులనుద్దేశించి మీడియాతో మాట్లాడారు. తనకు మద్దతు తెలిపిన అందరికీ ఆయన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.

Chandrababu_Naidu_Comments
Chandrababu_Naidu_Comments

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 5:34 PM IST

Updated : Oct 31, 2023, 6:54 PM IST

TDP Chief Chandrababu Naidu Comments: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి నేడు విడుదలయ్యారు. అనంతరం దేశ, విదేశాల్లో ఆయనకు మద్దతు తెలిపిన తెలుగు ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, పార్టీ నేతలు, వివిధ పార్టీల నాయకులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.

'నేను ఏ తప్పూ చేయలేదు.. ప్రజలు చూపిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను'

Chandrababu Naidu Comments: 52 రోజుల తర్వాత నారా చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ..''తెలుగు ప్రజలు అందరికీ నమస్కారాలు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరందరూ నాకు మద్దతు తెలిపారు. రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపారు, పూజలు చేశారు, ప్రార్ధనలు చేశారు. మీ అభిమానాన్ని నా జీవితంలో నేను ఎప్పుడూ మరిచిపోను. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ, విదేశాల్లోనూ నాకు సంఘీభావం ప్రకటించారు. నేను చేపట్టిన విధానాల వల్ల లబ్ధి పొందినవారంతా మద్దతిచ్చారు'' అని ఆయన అన్నారు.

Chandrababu Released from Rajahmundry Central Jail: రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల...

Chandrababu Thanks to Pawan Kalyan:అనంతరం తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు, ఎవరినీ కూడా తప్పుచేయనివ్వలేదన్నారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. తనకు అండగా నిలిచిన వివిధ పార్టీల నేతలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

''గత 52 రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్విరామంగా సంఘీభావం తెలిపారు. అందుకు వారందరికీ నా కృతజ్ఞతలు. తాజాగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. మీ అభిమానంతో నా జన్మ ధన్యమైంది. నేను చేసిన అభివృద్ధిని 52 రోజులూ గుర్తు చేసుకున్నారు. అండగా నిలబడిన ప్రతి కార్యకర్తలకు అభినందనలు. సంఘీభావం తెలిపిన జనసేన అధినేతపవన్ కల్యాణ్‌కు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు.''-నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత

Reaction Other Party Leaders on Chandrababu Bail: చంద్రబాబు బెయిల్ మంజూరపై పవన్, పురందేశ్వరి హర్షం

Chandrababu Released From Jail:మరోవైపు చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలు నుంచి విడుదలవుతున్న సందర్భంగా టీడీపీ ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో రాజమహేంద్రవరం జైలు వద్ద ఉద్వేగ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో 52 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలవ్వడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ..ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం చంద్రబాబును చూసి టీడీపీ అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబుకు స్వాగతం చెబుతూ అభిమానుల నినాదాలు చేశారు. దీంతో జై చంద్రబాబు.. నినాదాలతో జైలు పరిసర ప్రాంతాలు హోరెత్తిపోయాయి. టీడీపీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేసిన చంద్రబాబు..కష్టాల్లో ఉన్నప్పుడు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

CID on Chandrababu Liquor Case: మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ విచారణ.."అప్పటి వరకు అరెస్టు చేయమన్న సీఐడీ"

Last Updated : Oct 31, 2023, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details