తెలంగాణ

telangana

By

Published : Apr 20, 2023, 10:12 AM IST

ETV Bharat / bharat

Chandrababu Birthday: 74వ వసంతంలోకి టీడీపీ అధినేత.. పేదరిక నిర్మూలనపై విధాన ప్రకటన

Chandrababu birthday: ఉమ్మడి ఏపీలో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ్డాక తొలి ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. నేడు 74వ వసంతంలోకి అడుగుపెట్టారు.

Chandrababu birthday
Chandrababu birthday

HBDTeluguPrideBabu హ్యాష్ ట్యాగ్

Chandrababu birthday Celebrations: ఈరోజు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు ఆయన 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ట్విట్టర్​లో HBDTeluguPrideBabu హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా #HBDTeluguPrideBabu హ్యాష్ ట్యాగ్ పది నిముషాల్లోనే ఇండియా ట్రెండ్‌లోకీ వెళ్లింది.

అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు తెలుగుదేశం నేతలు ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం శ్రేణులు ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు, వేడుకలు ఏర్పాటు చేశారు. మార్కాపురంలో చిన్నారులతో కలిసి చంద్రబాబు జన్మదినం జరుపుకోనున్నారు.

నందమూరి రామకృష్ణ విషెస్​: తెలుగుదేశం పార్టీ రథసారథి చంద్రబాబుకు నందమూరి రామకృష్ణ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ వీరసైన్య కార్యకర్తల తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. మన చంద్రన్నకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు.

కర్నూలులో వేడుకలు: నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను కర్నూల్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు టీడీపీ ఇంచార్జ్ టీజీ.భరత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో అభివృద్ధి ఏమి చోటుచేసుకోలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యే వారి నియెజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం వందల, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే చెప్పుకోలేని పరిస్థితి నెలకొందన్నారు.

యువగళం పాదయాత్రలో బర్త్​డే: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ములుగుందం గ్రామంలో యువగళం పాదయాత్రలో చంద్రబాబు పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆలూరు ఇంఛార్జి కోట్ల సుజాతమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేశ్​ విసిరిన సవాళ్లకు.. మంత్రి జయరాం స్పందించడం లేదన్నారు. బూతు మాటలు మాట్లాడం సమంజసం కాదని... ధైర్యం ఉంటే సవాలుకు సిద్ధం కావాలని అన్నారు. ఇట్టినా భూములను మార్కెట్ ధరకు ఎలా కొన్నావు.. కోర్టులో ఉన్న భూములను ఎలా అమ్ముతావు అని ప్రశ్నించారు.

కోనసీమలో ప్రత్యేక పూజలు: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బండారు లంకలోని త్రయంబకేశ్వర ఆలయంలో తెలుగుదేశం నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని.. ఆయన మళ్లీ రాజ్యాధికారం చేపట్టాలని ఆయన పేరుతో ఆలయంలో పూజలు నిర్వహించారు. 108 కొబ్బరికాయలు కొట్టి అభిషేకం చేశారు.

మార్కాపురంలో అర్ధరాత్రి వేడుకలు: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన దినోత్సవ కార్యక్రమాన్ని అభిమానులు, తెలుగుదేశం నాయకులు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పర్యటన చేస్తున్న చంద్రబాబు మార్కాపురంలో బస చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బస చేసిన ప్రాంతంలో అభిమానులు అర్ధరాత్రి జన్మదిన వేడుకలు నిర్వహించి సందడి చేశారు. సరిగ్గా రాత్రి 12 గంటలు సమయంలో బాణాసంచా కాలుస్తూ హడావుడి చేశారు.

గుంటూరులో దుప్పట్ల పంపిణీ: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సరిపూడి గ్రామంలో బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి వలస కూలీలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని ముందస్తుగా దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం వంద మందికి దుప్పట్లు ఇచ్చామన్నారు. వలస కూలీలు ఏర్పాటు చేసుకున్న గుడారాల వద్దకు వెళ్లి పరిశీలించారు. కూలీలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదా ఆరా తీశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details