తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Live Updates: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా..

cbn
cbn

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 11:03 AM IST

Updated : Oct 9, 2023, 5:01 PM IST

17:00 October 09

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు పీటీ వారెంట్ కేసుపై రేపు వాదనలు వింటామన్న ఏసీబీ కోర్టు

  • ఇన్నర్‌ రింగ్‌రోడ్డు పీటీ వారెంట్ కేసుపై రేపు వాదనలు వింటామన్న ఏసీబీ కోర్టు
  • చంద్రబాబు కేసుకు సంబంధించి సీఐడీ, కౌంటర్ పిటిషన్లు రోజూ మధ్యాహ్నం వింటామన్న జడ్జి

16:59 October 09

అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్‌ కేసులో మరో పిటిషన్ వేసిన సీఐడీ

  • అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్‌ కేసులో మరో పిటిషన్ వేసిన సీఐడీ
  • విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సీఐడీ
  • రింగ్‌రోడ్‌ కేసులో మరో ఐదుగురిని నిందితులుగా చేర్చిన అధికారులు
  • మాజీమంత్రి నారాయణ సతీమణి రమాదేవి, ప్రమీలను చేర్చిన సీఐడీ
  • ఆవుల మణిశంకర్, రాపూరి సాంబశివరావు, కొత్తపు అరుణ్‌కుమార్‌ను చేర్చిన సీఐడీ
  • ఐపీసీ 120బి, 409, 420, 34, 35, 37, 166 సెక్షన్ల కింద కేసు నమోదు
  • 167 రెడ్ విత్ 13(2) పి.ఒ.సి చట్టంలోని 13(1)(సి)(డి) సెక్షన్ల కింద కేసు

16:03 October 09

విచారణ రేపటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం

  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
  • విచారణ రేపటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం
  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై రేపు కొనసాగనున్న వాదనలు

15:52 October 09

మీ క్లయింట్‌ కేసులో 17ఏ వర్తిస్తుందన్నదానికి ఆధారాలు కనిపిస్తున్నాయి: జస్టిస్‌ అనిరుద్ధబోస్

  • మీ క్లయింట్‌ కేసులో 17ఏ వర్తిస్తుందన్నదానికి ఆధారాలు కనిపిస్తున్నాయి: జస్టిస్‌ అనిరుద్ధబోస్
  • అవును.. బెంచ్‌ పరిశీలన వాస్తవమే: హరీష్‌ సాల్వే
  • 17ఏ అన్నది అవినీతిని నిరోధించడంలో భాగంగా వచ్చింది: జస్టిస్‌ త్రివేది
  • అవినీతిని నిరోధించడంలో నష్టం జరగకూడదన్న బాధ్యత కూడా ఉంది: జస్టిస్‌ త్రివేది
  • మీరన్నది నిజమే.. కేసు నమోదు, విచారణ అధీకృత అధికారి నుంచి అనుమతి తీసుకున్నాక విచారణ చేయడంలో ఎవరికీ అభ్యంతరం లేదు: సాల్వే
  • అవినీతి నిరోధక చట్టాన్ని ధృడతరం చేస్తూనే ప్రజాప్రతినిధులు స్వతంత్రంగా పనిచేసే అవకాశాన్ని 17ఏ కల్పించింది: సాల్వే

15:32 October 09

రెండు పిటిషన్లూ కొట్టివేసిన విజయవాడ ఏసీబీ కోర్టు

  • చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్లు కొట్టివేసిన ఏసీబీ కోర్టు
  • రెండు పిటిషన్లూ కొట్టివేసిన విజయవాడ ఏసీబీ కోర్టు

15:32 October 09

ఎస్‌వోపీ ప్రకారం కేసు నమోదుకు, విచారణకు దేనికది ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిందే: సాల్వే

  • ఎస్‌వోపీ అన్నది ఈ కేసులో అన్వయించుకోవడానికి అందుబాటులో ఉంది: సాల్వే
  • మెరిట్స్‌ ఆధారంగా బెంచ్‌ నిర్ణయం తీసుకోవచ్చు: హరీష్‌ సాల్వే
  • ఎస్‌వోపీ ప్రకారం కేసు నమోదుకు, విచారణకు దేనికది ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిందే: సాల్వే
  • ఒక ప్రజాప్రతినిధిపై విచారణ జరగాలంటే 17ఏ ప్రకారం అప్రూవల్‌ తీసుకోవాల్సిందే: సాల్వే
  • చట్ట సవరణ జరిగిన మూడేళ్లకు ఎస్‌వోపీ వచ్చింది.. అంతకుముందు ఏం జరిగిందన్న జస్టిస్‌ త్రివేది
  • ఇలాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రేజీమ్‌, రివేంజ్‌ అనే పదాలను తీసుకొచ్చింది: సాల్వే
  • రేపు ఉదయం 10.30 గం.కు వాదనలు వినిపించేందుకు అనుమతి కోరిన రోహత్గీ
  • రోహత్గీ అభ్యర్థనకు అనుమతించిన సుప్రీంకోర్టు ధర్మాసనం

15:22 October 09

17ఏ ప్రకారం ప్రజాప్రతినిధులపై ఎంక్వైరీ, ఇంక్వైరీ, ఇన్వెస్టిగేషన్‌.. దేనికైనా పోలీసులు అనుమతులు పొందాల్సిందే: సాల్వే

  • 17ఏ ప్రకారం ప్రజాప్రతినిధులపై ఎంక్వైరీ, ఇంక్వైరీ, ఇన్వెస్టిగేషన్‌.. దేనికైనా పోలీసులు అనుమతులు పొందాల్సిందే: సాల్వే
  • 17ఏలో ఉన్న నిబంధనలు ఒక్కొక్కటిగా బెంచ్‌ ముందు ఉంచుతున్న హరీష్‌ సాల్వే
  • యశ్వంత్‌ సిన్హా కేసులో తీర్పు తర్వాత స్పష్టమైన నిబంధనలు ఏర్పాటయ్యాయి: సాల్వే
  • యశ్వంత్‌ సిన్హా కేసులోని మెరిట్స్‌ ఆధారంగా ఈ కేసును పరిగణించాల్సి ఉంటుంది: సాల్వే

14:50 October 09

విచారణ ఎప్పుడు ప్రారంభమైంది: జస్టిస్‌ అనిరుద్ధబోస్

  • విచారణ ఎప్పుడు ప్రారంభమైంది: జస్టిస్‌ అనిరుద్ధబోస్
  • ప్రాథమిక విచారణ 2021న ప్రారంభమైంది: హరీష్‌ సాల్వే
  • 2021 సెప్టెంబర్‌ 7న ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభమైంది: సాల్వే
  • ఆ ఫిర్యాదుతో పిటిషనర్‌కు సంబంధమే లేదు: హరీష్‌ సాల్వే
  • డిజైన్‌ టెక్‌ అనే కంపెనీకి సంబంధించింది: హరీష్‌ సాల్వే
  • ఒప్పందం ఎవరితో జరిగిందని ప్రశ్నించిన జస్టిస్‌ త్రివేది
  • రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం జరిగిందని సమాధానమిచ్చిన సాల్వే
  • డిజైన్‌ టెక్‌, స్కిల్‌ టెక్‌ మధ్యలో జీఎస్టీకి సంబంధించిన ఫిర్యాదు ఇది: సాల్వే
  • 2021 సెప్టెంబర్‌ 7న ఫిర్యాదు వచ్చింది కూడా డిజైన్‌ టెక్‌పైనే: సాల్వే
  • డిజైన్‌ టెక్‌, సీమెన్స్‌ సొమ్ము తరలించారన్న ఆరోపణలకు సంబంధించింది: సాల్వే
  • అన్ని పరిణామాలను పరిశీలిస్తే... కేసు నమోదు, ఫిర్యాదు, విచారణ అన్నీ కూడా 2021లోనే: సాల్వే
  • జూన్‌ 2018లో ఎఫ్‌ఐఆర్‌ లేదు.. విచారణే లేదు: హరీష్‌ సాల్వే
  • 17ఏకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పును ఉదహరించిన హరీష్‌ సాల్వే
  • 2018 జులైకు ముందు జరిగిన నేరాలకు 17ఏ వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం వాదనగా ఉంది: సాల్వే
  • దాని ఆధారంగానే 2018కి ముందే నేరం జరిగినందున 17ఏ వర్తించదని ప్రభుత్వం వాదనగా ఉంది: సాల్వే
  • ఆరోపణలన్నీ 2015, 2016కు సంబంధించినవి కాబట్టి ఇప్పటి విచారణలో పరిగణనలోకి తీసుకోలేమని హైకోర్టు భావించింది: సాల్వే
  • వీటన్నింటిని మేము కోర్టు ముందు ఉంచుతున్నాం: హరీష్‌ సాల్వే
  • ఫిర్యాదు, విచారణ అన్నీ 2021లో ఉన్నాయి కాబట్టి 17ఏ వర్తిస్తుందని కోర్టుకు విన్నవిస్తున్నాం: సాల్వే
  • కేసులో ఎప్పుడు ఏం జరిగింది... వివరాలేంటి అనేదానిపై ఇప్పుడు మేము ప్రస్తావించట్లేదు: సాల్వే
  • కేసులో ఉన్న వాస్తవాలపై రాష్ట్ర ప్రభుత్వం మసిపూసే ప్రయత్నం చేసింది: సాల్వే
  • రిమాండ్‌ ఆర్డర్‌ స్పష్టంగా 2021లో జరిగిన ప్రాథమిక విచారణ ఆధారంగానే కేసు నమోదు చేసినట్లు ఉంది: సాల్వే
  • 2015-2016లో చంద్రబాబు నిధులు విడుదల చేసినట్లు చెబుతున్నారు: సాల్వే
  • నిధుల విడుదల అనేది కేబినెట్‌ నిర్ణయం, వ్యక్తులకు వర్తింపచేయలేము: సాల్వే
  • 17ఏకు ఉన్న అన్వయాన్ని మాత్రమే బెంచ్‌ ముందు ఉంచదలచుకున్నా: సాల్వే
  • 17ఏ తీసుకొచ్చిన కారణమే రాజకీయ ప్రతీకార చర్యలు లేకుండా ఉండడం కోసం: సాల్వే
  • ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వాలపై వేధింపులు లేకుండా ఉండేందుకే చట్టసవరణ జరిగి 17ఏ అమలులోకి వచ్చింది: సాల్వే
  • 17ఏ అమలుపై కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను రాష్ట్రాలకు జారీచేసింది: సాల్వే
  • దేశవ్యాప్తంగా ఒకేలా అమలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం ప్రొసీజర్‌ను తీసుకొచ్చింది: సాల్వే
  • సింగిల్‌ విండోలో పబ్లిక్‌ సర్వెంట్లందరికి రక్షణ కల్పించేందుకు 17ఏ ఉపకరిస్తుంది: సాల్వే
  • పబ్లిక్‌ సర్వెంట్లపై ఆరోపణలు చేయాలంటే తప్పనిసరిగా అధీకృత అధికారి నుంచి సమ్మతి అవసరం: సాల్వే
  • ఉద్యోగులనైనా, ప్రజాప్రతినిధులనైనా ఎలాంటి పద్ధతి ఫాలో కావాలన్నదానిపై ఎస్‌వోపీలో పేర్కొన్నారు: సాల్వే
  • ప్రతీకార చర్యలకు పాల్పడిన సందర్భాలు ఉన్నందునే చట్టానికి సవరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది: సాల్వే

14:16 October 09

భోజన విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైన వాదనలు

  • చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం
  • భోజన విరామం తర్వాత మళ్లీ ప్రారంభమైన వాదనలు
  • 17ఏ అనేది డేట్‌ ఆఫ్‌ ఎఫ్‌ఐఆర్‌ వర్తిస్తుందా లేదా డేట్‌ ఆఫ్‌ అఫెన్స్‌ కింద వర్తిస్తుందా అనేది కోర్టు ముందుంచాం: సాల్వే
  • నేరుగా నగదు తీసుకుంటూ పట్టుబడితే తప్ప మిగిలిన అన్నింటికి 17ఏ వర్తిస్తుంది: సాల్వే
  • అవినీతి నిరోధక శాఖ చట్టం ప్రకారం కేసు పెడితే ఈపాటికి మాకు ఉపశమనం లభించేది: సాల్వే
  • రిమాండ్‌ రిపోర్టును మేము ఛాలెంజ్‌ చేస్తున్నాం: హరీష్‌ సాల్వే
  • రిమాండ్‌ రిపోర్డుపైనే మా వాదనంతా: హరీష్‌ సాల్వే
  • 17ఏకు సంబంధించి పంకజ్‌ బన్సల్‌ కేసును ఉదహరించిన హరీష్‌ సాల్వే
  • 17ఏకు వర్తించే అన్ని కేసుల్లో ప్రతి సందర్భంలో అనుమతి తీసుకోవాలనేది కేంద్రం స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ జారీచేసింది: సాల్వే
  • 17ఏ విషయంలో హైకోర్టులో భిన్నమైన ఉత్తర్వులు వచ్చాయి: హరీష్‌ సాల్వే
  • కొన్ని హైకోర్టులు డేట్‌ ఆఫ్‌ అఫెన్స్‌ నుంచి పరిగణించాయి.. కొన్ని కోర్టులు డేట్‌ ఆఫ్‌ ఎఫ్‌ఐఆర్‌ను పరిగణించాయి: సాల్వే
  • హైకోర్టులో దాఖలు చేసిన డాక్యుమెంట్లు వాదనలు పూర్తయ్యాక కోర్టు ముందు ఉంచామని మీరు చెబుతున్నారు: జస్టిస్‌ త్రివేది
  • ఆ డాక్యుమెంట్లలో ఉన్నదానిపై కౌంటర్‌ దాఖలు చేసే సమయం మీకు లేకపోయింది అని అడుగుతున్నారు: జస్టిస్‌ త్రివేది
  • మంచి, చెడు అనేది పక్కన పెడితే హైకోర్టు డేట్‌ ఆఫ్‌ అఫెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంది: సాల్వే
  • డేట్‌ ఆఫ్‌ ఎఫ్‌ఐఆర్‌ పరిగణనలోకి తీసుకోవాలని మా వాదన: సాల్వే
  • గౌరవనీయమైన కోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది: సాల్వే
  • ఇప్పటికే వాళ్లు కేవియట్‌ వేశారు.. నోటీసు అన్నది ఇప్పుడు అసందర్భం: హరీష్‌ సాల్వే

14:09 October 09

అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్‌ కేసులో మరో పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ

  • అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్‌ కేసులో మరో పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ
  • విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సీఐడీ
  • రింగ్‌రోడ్‌ కేసులో కొత్తగా మరో నలుగురిని నిందితులుగా చేర్చిన అధికారులు
  • మాజీమంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీలను నిందితులుగా చేర్చిన సీఐడీ
  • ఆవుల మణిశంకర్, రాపూరి సాంబశివరావులను నిందితులుగా చేర్చిన సీఐడీ
  • ఐపీసీ 120బి, 409, 420, 34, 35, 37, 166 సెక్షన్ల కింద కేసు నమోదు
  • 167 రెడ్ విత్ 13(2) పి.ఒ.సి చట్టంలోని 13(1)(సి)(డి) సెక్షన్ల కింద కేసు

14:06 October 09

అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్‌ కేసులో మరో పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ

  • అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్‌ కేసులో మరో పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ
  • విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సీఐడీ
  • కేసులో కొత్తగా మరో నలుగురిని నిందితులుగా చేర్చిన అధికారులు
  • మాజీమంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీలను నిందితులుగా చేర్చిన సీఐడీ
  • ఆవుల మణి శంకర్, రాపూరి సాంబశివరావులను నిందితులుగా చేర్చిన సీఐడీ
  • ఐపీసీ 120బి, 409, 420, 34, 35, 37, 166 సెక్షన్ల కింద కేసు నమోదు
  • 167 రెడ్ విత్ 13(2) పి.ఒ.సి చట్టంలోని 13(1)(సి)(డి) సెక్షన్ల కింద కేసు

13:16 October 09

మధ్యాహ్నం 2 గంటలకు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

  • చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
  • మధ్యాహ్నం 2 గంటలకు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

13:14 October 09

సెప్టెంబర్‌ 19న వాదనలు పూర్తయి హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది: హరీష్‌ సాల్వే

  • సెప్టెంబర్‌ 19న వాదనలు పూర్తయి హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది: హరీష్‌ సాల్వే
  • రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 20న కొన్ని డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచింది: హరీష్‌ సాల్వే
  • 19న వాదనలు పూర్తయి తీర్పు వాయిదా వేశాక రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పత్రాలను కోర్టు ముందు ఉంచింది: హరీష్‌ సాల్వే
  • 2018లో నేరం జరిగిందన్న వివరాలేవీ రిమాండ్‌ రిపోర్టులో పెట్టలేదు: హరీష్‌ సాల్వే
  • 2021లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే రిమాండ్‌ రిపోర్టు ఉంది: హరీష్‌ సాల్వే
  • రిమాండ్‌ రిపోర్టు ఆధారంగా మేం చెప్పదలచుకుంది 17ఏ వర్తిస్తుందనే: హరీష్‌ సాల్వే
  • చట్టసవరణ ఎప్పటినుంచి అమలులోకి వస్తుందన్న దానిపై 1959 ఎస్‌ఈఆర్‌ 191 కేసును ఉదహరించిన హరీష్‌ సాల్వే
  • 1959 ఎస్‌ఈఆర్‌ 191 కేసు జడ్జిమెంట్‌ ప్రకారం చట్టసవరణకు ముందు కేసులకు కూడా వర్తిస్తుంది: హరీష్‌ సాల్వే

13:06 October 09

మధ్యాహ్నం 2 గంటలకు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

  • చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
  • మధ్యాహ్నం 2 గంటలకు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

12:42 October 09

జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన ధర్మాసనం విచారణ

  • చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం
  • సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని చంద్రబాబు పిటిషన్‌
  • తనపై పెట్టిన స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టివేయాలని చంద్రబాబు పిటిషన్‌
  • జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన ధర్మాసనం విచారణ
  • చంద్రబాబు తరఫున హరీష్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా, అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు
  • సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ, పొన్నవోలు సుధాకర్‌ వాదనలు

11:45 October 09

రాజమహేంద్రవరం టీడీపీ క్యాంపు కార్యాలయానికి తరలివచ్చిన మహిళలు

  • రాజమహేంద్రవరం టీడీపీ క్యాంపు కార్యాలయానికి తరలివచ్చిన మహిళలు
  • రాజమహేంద్రవరం: నారా భువనేశ్వరికి సంఘీభావం తెలిపిన మహిళలు
  • కొవ్వూరు నియోజకవర్గం నుంచి సుమారు 150 మంది మహిళలు భువనేశ్వరికి మద్దతు
  • మాజీమంత్రి జవహర్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం వద్దకు తరలివచ్చిన మహిళలు

11:14 October 09

చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై మధ్యాహ్నం ఏసీబీ కోర్టు తీర్పు

  • చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై మధ్యాహ్నం ఏసీబీ కోర్టు తీర్పు
  • భోజన విరామం తర్వాత తీర్పు వెలువరించనున్న విజయవాడ ఏసీబీ కోర్టు
  • స్కిల్‌ కేసులో బెయిల్‌ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్‌
  • చంద్రబాబును కస్టడీకి కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన సీఐడీ

10:47 October 09

Live Updates: అమరావతి రింగ్ రోడ్, ఫైబర్‌నెట్, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లు కొట్టివేత

  • చంద్రబాబు దాఖలు చేసిన 3 బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు
  • అమరావతి రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత
  • ఫైబర్‌నెట్, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్లు కొట్టివేత
Last Updated : Oct 9, 2023, 5:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details