తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో 24గంటల్లో 'తౌక్టే' మహోగ్రరూపం - తౌక్టే

రానున్న 24గంటల్లో తౌక్టే తుపాను అతి భీకరంగా మారనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తౌక్టే తుపాను వల్ల కేరళ, గోవా, పుణె, గుజరాత్​, కర్ణాటకలో భారీ వర్షాలు కురిశాయి. ఇళ్లు కూలిపోయాయి. చెట్లు, విద్యుత్​ స్తంభాలు నేలమట్టమయ్యాయి.

Tauktae
తౌక్టే

By

Published : May 17, 2021, 4:13 AM IST

రానున్న 24గంటల్లో తౌక్టే తుపాన్​ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 18న గుజరాత్​లోని పోర్​బందర్​, మహూవా తీరాన్ని దాటనున్నట్లు తెలిపింది.

మే 17, 18న గుజరాత్​లోని తీర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గాలులు గంటకు 115-165కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది. పిడుగులతో కూడిన వర్షం పడొచ్చని, మే18 వరకు చేపల వేటకు అరేబియా సముద్రం మీదికి వెళ్లొద్దని మత్య్సకారులను హెచ్చరించింది.

పుణె..

పుణెలో కూలిన పాఠశాల పైకప్పు

తౌక్టే వల్ల వీచిన ఈదురు గాలులకు పుణెలోని భోర్​గిరి, భీవేగావ్​ గ్రామాల్లోని అంగన్​ వాడీ, ప్రాథమిక పాఠశాల, గ్రామపంచాయతీ భవనాల పైకప్పులు కూలిపోయాయి.

కేరళ..

కేరళలో జలదిగ్బంధంలో ఇళ్లు
రోడ్లపై వరద

తౌక్టే వల్ల కురిసిన కుండపోత వర్షానికి అలప్పుజలో ఇళ్లు, రోడ్లు జలదిగ్బంధం అయ్యాయి.

తిరువనంతపురంలోని పరిస్థితి..

తిరువనంతపురంలో
తిరువనంతపురంలో
కేరళలో ఇంట్లోకి నీళ్లు

గోవా..

గోవాలో కూలిన చెట్లు

తౌక్టే ధాటికి పనాజీలో చెట్లు విరిగి రోడ్లమీద పడ్డాయి.

కర్ణాటకలో...

కర్ణాటక
కర్ణాటకలో కూలిన ఇళ్లు
కూలిన స్తంభాలు
గాలుల ధాటికి కూలిన చెట్లు
గాలుల ధాటికి కూలిన చెట్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details