తెలంగాణ

telangana

'కోబ్రా' జవాన్​ విడుదలలో వారిదే కీలక పాత్ర

By

Published : Apr 10, 2021, 8:14 AM IST

కోబ్రా జవాన్​ రాకేశ్వర్​ సింగ్​ మన్హాస్ భార్య, కుమార్తె కన్నీళ్లు చూసే మావోయిస్టులను కలిశామని జవాన్​ను విడిపించటంలో కీలక పాత్ర పోషించిన విశ్రాంత ఉపాధ్యాయుడు బోరయ్య 'ఈటీవీ భారత్'​కు తెలిపారు. బీజాపుర్‌ దాడి అనంతరం.. మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా జవాన్‌ను మధ్యవర్తిత్వ బృందం చర్చల అనంతరం గురువారం విడుదల చేసింది. మావోయిస్టుల వద్దకు వెళ్లిన పద్మశ్రీ ధరమ్​పాల్​ సైనీ బృందంలో ఒకరే బోరయ్య.

Tau of Bastar who got CoBRA commando released from Naxals
జవాన్​ను విడిపించటంలో వారిదే కీలక పాత్ర

జవాన్‌ రాకేశ్వర్‌సింగ్‌ మన్హాస్‌ భార్య, కుమార్తె కన్నీళ్లు చూసే మావోయిస్టుల వద్దకు వెళ్లామని 'పద్మశ్రీ' ధరమ్​పాల్​ సైనీ బృందంలో ముఖ్య పాత్ర పోషించిన తెలం బోరయ్య శుక్రవారం 'ఈటీవీ భారత్‌'కు తెలిపారు. బీజాపుర్‌ మెరుపుదాడి అనంతరం.. మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా జవాన్‌ను మధ్యవర్తిత్వ బృందం చర్చల అనంతరం గురువారం విడుదల చేసింది.

ఈటీవీ భారత్​తో మాట్లాడుతున్న బోరయ్య

ఆవుపల్లి బ్లాక్‌లోని కమర్‌గూడకు చెందిన గోండ్వానా సమాజ్‌ జిల్లా అధ్యక్షుడు, విశ్రాంత ఉపాధ్యాయుడైన బోరయ్య ప్రభుత్వం తరఫున మావోయిస్టులతో చర్చించేందుకు బృందంతో వెళ్లారు. ఎవరికి ఏ కష్టం, సమస్య వచ్చినా 70 ఏళ్ల బోరయ్య స్పందించి తనవంతు సాయం చేసేందుకు ప్రయత్నిస్తారు. మావోయిస్టులను కలిసిన సమయంలో.. అక్కడ జరిగిన పరిణామాలను ఆయన వివరించారు. పోలీసులకు పట్టుబడిన గిరిజనుణ్ని మావోయిస్టులకు అప్పగించినట్లుగా ఆయన తెలిపారు. కీకారణ్య ప్రాంతంలో జవాన్‌ను ఓ గుడిసెలో ఉంచగా.. తమ బృందం సభ్యులను మరోచోట ఉంచారని.. ఈ సమయంలో ఓ మహిళా మావోయిస్టు నాయకురాలు వచ్చి తమతో మాట్లాడారని బోరయ్య చెప్పారు. టెక్నోడోమ్‌ సమీపంలో పట్టుకున్న గ్రామస్థుణ్ని పోలీసులు విడుదల చేశారా?.. అని ఆమె ప్రశ్నించగా అతన్ని మావోయిస్టులకు అప్పగించినట్లు చెప్పామని.. దాంతో జవాన్‌ రాకేశ్వర్‌సింగ్‌ను క్షేమంగా విడిచిపెట్టారని ఆయన వివరించారు.

సురక్షితంగా తీసుకురావాలనే..

జవాన్​ కుటుంబంతో 'పద్మశ్రీ' ధరమ్​పాల్​ సైనీ


మావోయిస్టుల చెర నుంచి జవాన్‌ను సురక్షితంగా తీసుకురావాలన్న లక్ష్యంతోనే మధ్యవర్తిత్వం వహించినట్లు బృందంలోని కీలక ప్రముఖుడు, 'పద్మశ్రీ' ధరమ్‌పాల్‌ సైనీ (91) తెలిపారు. మావోయిస్టులతో చర్చల ప్రక్రియ సానుకూలంగా సాగినట్లు ఆయన వివరించారు. ఈ మొత్తం సమయంలో రాకేశ్వర్‌సింగ్‌ ప్రశాంతంగా ఉన్నట్లు తెలిపారు.

ఆయన విడుదల సందర్భంగా మావోయిస్టులు ఎలాంటి షరతులూ విధించలేదని తెలిపారు. ఆయన క్షేమంగా తన ఇంటికి చేరుకున్నాక ఒక ఫొటో కావాలని మాత్రమే అడిగినట్లు చెప్పారు.

ఇదీ చదవండి :బంగాల్​ దంగల్​: నాలుగో విడత పోలింగ్​ షురూ

ABOUT THE AUTHOR

...view details