Tattoo artist arrest: టాటూలు వేసుకోవడానికి వచ్చిన మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు. కేరళలోని ఎటప్పళ్లిలో సుజీష్ అనే వ్యక్తికి టాటూ స్టూడియో ఉంది. అతడి స్టూడియోకు వచ్చినప్పుడు అత్యాచారానికి పాల్పడ్డాడని 18 సంవత్సరాల యువతి సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది. ఆ పోస్ట్ ఆధారంగా.. ఎర్నాకుళం పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేశారు.
టాటూల కోసం వెళ్తే లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్ - kerela police
Tattoo artist arrest: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న కారణంతో ఓ టాటూ ఆర్టిస్ట్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన కేరళలో జరిగింది.
లైంగిక వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తి అరెస్ట్
ఇప్పటివరకు ఆరుగురు బాధిత మహిళల ఫిర్యాదు మేరకు చెరనల్లూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు సుజీష్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశ పెడతామని తెలిపారు.
ఇదీ చదవండి: స్నేహితులతో కలిసి భార్యపై భర్త గ్యాంగ్ రేప్