ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో క్షుద్రపూజల నెపంతో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కిరాతకుడు. అనారోగ్యంతో మాంత్రికుడి దగ్గరకు వెళ్లగా.. మత్తుమందు ఇచ్చి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు తహ్రీర్‌పై అత్యాచార, పోక్సో చట్టాల కింద గౌరా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఇదీ జరిగింది..
ఈ నెల 22న రాత్రి బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో బాధితురాలి తల్లి తాంత్రికుడి దగ్గరకు తీసుకుపోయింది. చికిత్స పేరిట చిన్నారికి మత్తు మందు ఇచ్చాడు ఆ వ్యక్తి. అపస్మారక స్థితిలోకి వెళ్లాక అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో బాలికకు తీవ్ర రక్తస్రావం అయినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
అధిక రక్తస్రావం కావడం చూసిన తల్లి బాధితురాలిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించింది.
ఇదీ చూడండి: ప్రేయసి తల్లి, చెల్లిని హత్యచేసి.. ఇంట్లోనే పూడ్చిపెట్టి!