తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మృతదేహానికి ప్రాణం పోస్తామంటూ క్షుద్రపూజలు! - మృతదేహానికి క్షుద్రపూజలు

శాస్త్ర సాంకేతికత రాజ్యమేలుతున్న నేటి రోజుల్లో.. ఇంకా మూఢ నమ్మకాలతో జీవిస్తున్నారు కొందరు. చనిపోయిన వ్యక్తిని మళ్లీ బతికిస్తామంటూ పూజలు చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఒడిశాలో వెలుగుచూసింది.

People adopting blind beliefs in the age of science with tried to resurrect a dead man in Nayagarh
ఆ రాష్ట్రంలో మృతదేహానికి క్షుద్రపూజలు!

By

Published : Apr 6, 2021, 2:51 PM IST

సైన్స్​ అభివృద్ధి చెందుతున్న నేటి కాలంలో.. కొందరు ప్రజల్లో ఇంకా మూఢ నమ్మకాలు బలంగా ఉన్నాయనేందుకు ఈ ఘటనే నిదర్శనం. ఒడిశా నయాగఢ్​ జిల్లాలో ఓ వ్యక్తి మరణించగా.. అతణ్ని బతికించాలనే సంకల్పంతో గత శనివారం(ఈ నెల 3న) అనేక మత కార్యకలాపాలు నిర్వహించారు స్థానికులు.

మృతదేహానికి క్షుద్రపూజలు
మృతదేహానికి క్షుద్రపూజలు

ఏం జరిగిందంటే?

బార్సాహీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతణ్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అక్కడే చనిపోయాడు. వైద్యులు మృతదేహానికి శవ పరీక్ష చేసి.. ఆ కుటుంబానికి అప్పగించారు. అయితే... అంత్యక్రియలు నిర్వహించడానికి బదులుగా.. అనేక పూజా కార్యక్రమాలు చేపట్టారు స్థానికులు. అతణ్ని ఎలాగైనా బతికించాలనే ఉద్దేశంతో.. రకరకాల క్షుద్ర పూజలు నిర్వహించారు. ఎన్నో ప్రార్థనలు చేశారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అతణ్ని తిరిగి బతికించలేకపోయారు.

మృతదేహానికి క్షుద్రపూజలు
మృతదేహానికి క్షుద్రపూజలు
మృతదేహానికి క్షుద్రపూజలు

ఇదీ చదవండి:రైతుల మట్టి సత్యాగ్రహం- అమరులకు స్తూపం

ABOUT THE AUTHOR

...view details