Youth Killed at Fishing Pond: తమిళనాడులోని డిండిగుల్ జిల్లాలో దారుణం జరిగింది. చేపల చెరువుకు కాపలాగా ఉన్న ఓ యువకున్ని అర్థరాత్రి కాల్చి చంపారు దుండగులు.
చేపల చెరువుకు కాపలాగా ఉన్న యువకుని దారుణ హత్య! - youth killed at fishing pond
Youth Killed at Fishing Pond: చేపల చెరువుకు కాపలాగా ఉన్న ఓ యువకున్ని అర్థరాత్రి కాల్చి చంపారు దుండగులు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని డిండిగుల్ జిల్లాలో జరిగింది.
జిల్లాలో మరియనాథపురంలో నివసిస్తున్న మణిక్కం కుమారుడు రాకేశ్(26). స్థానికంగా చేపల చెరువును లీజ్‌కు తీసుకున్నాడు. ఈ క్రమంలో జనవరి 2న అర్థరాత్రి చేపలను దొంగిలించకుండా కాపలాగా వెళ్లిన రాకేశ్.. చెరువు కట్టపై తన స్నేహితులతో కూర్చుని మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన దుండగులు తుపాకీతో కాల్చి చంపారని అక్కడే ఉన్న బాధితుని స్నేహితులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బైక్‌పై పారిపోయారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలు హంతకుల కోసం వేట ప్రారంభించాయని పోలీసు అధికారులు తెలిపారు.