తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సంతాప సభకు వెళ్లి వస్తుండగా విషాదం, ఆరుగురు దుర్మరణం - బస్సు వ్యాన్​ ఢీ

Salem Road Accident ఎదురెదురుగా వస్తున్న వ్యాన్​, ప్రైవేట్​ బస్సు బలంగా ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని సేలం జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

road accident in tamilnadu
మృతి చెందిన ప్రయాణికులు

By

Published : Aug 23, 2022, 12:35 PM IST

Salem Road Accident: తమిళనాడులోని సేలం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న వ్యాన్​, ప్రైవేట్​ బస్సు బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మహిళలతో సహా ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం..ఓమ్నీ వ్యాన్‌లోని ప్రయాణికులంతా అత్తూరులో జరిగిన ఓ వ్యక్తి సంతాప సభకు వెళ్లి సేలం తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటాక ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేట్ బస్సును వ్యాన్​ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలతో సహా ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సహాయంతో పోలీసులు.. క్షతగాత్రులను సేలం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

మృతి చెందిన ప్రయాణికులు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంగళవారం.. సేలం జిల్లా కలెక్టర్ కర్మేగం పరామర్శించారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంపై ఏటూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details