తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడులో భారీ వర్షాలు- 8 మంది మృతి - చెన్నైలో వర్షాలు

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెన్నై సహా పలు తీర ప్రాంతాల్లో (Tamil Nadu Rain Update) రెడ్​ అలర్ట్​ ప్రకటించింది వాతావరణ శాఖ. వర్షాల కారణంగా శుక్రవారం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఏనిమిదికి చేరింది.

Tamil Nadu Rain Update
తమిళనాడు భారీ వర్షాలు- తీర ప్రాంతాలకు రెడ్​ అలెర్ట్​

By

Published : Nov 27, 2021, 12:02 PM IST

బంగాళఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా తమిళనాడును (Tamil Nadu Rain Update) మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చెన్నై సహా పలు తీర ప్రాంతాల్లో రెడ్​ అలర్ట్​ ప్రకటించిన వాతావరణ శాఖ.. మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కన్యాకుమారి- శ్రీలంకలోని తీర ప్రాంతాల్లో (Tamil Nadu Rain Update) ఈ తుపాను కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాలకు జలమయమైన రోడ్లు
వరదలో వాహనదారుల ఇక్కట్లు
భారీ వర్షాలకు జలమయమైన రోడ్లు

తురునేళ్​వేలి, ట్యుటికోరిన్, కన్యాకుమారి, రామనాథపురం, తిరువన్నామలయ్, చెంగల్​పట్టు, విల్లుపురం, కడలూరు సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Tamil Nadu Rain Update) కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పుదుచ్చేరి, కరాయ్​కల్​ సహా సమీప ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

వర్షాల కారణంగా పలుచోట్ల రాకపోకలకు అంతరాయం
భారీ వర్షాలకు నేలకొరిగిన చెట్టు

వర్షాల కారణంగా శుక్రవారం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఏనిమిదికి చేరింది. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.

ఇదీ చూడండి :ఒకేసారి ఆరుగురు అక్కాచెల్లెళ్ల వివాహం

ABOUT THE AUTHOR

...view details