కొబ్బరి చెట్టు ఎంత ఎత్తు ఉంటుంది అని అడిగితే ఓ అంతెత్తు అని టక్కున చెబుతుంటాం. అయితే మూడు అడుగుల కొబ్బరి చెట్లు ఎప్పుడైనా చూశారా? అదీ విపరీతంగా కాయలు కాస్తున్న చెట్టు గురించి తెలుసా? తమిళనాడు మైలాడుతురై జిల్లా మరైయూర్ గ్రామంలో ఉన్న ఓ కొబ్బరి చెట్టు కేవలం మూడడుగులే పెరిగింది. అంతేగాక అనేక కాయలు కాస్తూ అబ్బురపరుస్తోంది.
ఇలా ఎలా..?
గ్రామానికి చెందిన శివకుమార్ అనే రైతు ఇంట్లో 12 ఏళ్ల క్రితం నాటిన ఓ కొబ్బరి చెట్టు 22 అడుగుల పొడవు ఉండేది. డజన్ల కొద్దీ కాయలు కాసే ఈ చెట్టు విత్తనాన్ని 2018లో శివకుమార్ తన పెరట్లో నాటాడు. ఆ మొక్క పెరుగుతున్న క్రమంలో దానిపై పిడుగు పడింది. దీనితో శివకుమార్ కుటుంబమంతా చాలా బాధపడింది.