Tamil Nadu bride wall posters: తమిళనాడులో ఓ వ్యక్తి వధువు కావాలంటూ పోస్టర్లు అంటించాడు. మదురైలోని విల్లుపురంలో నివసించే 27ఏళ్ల జగన్.. పట్టణమంతా ఈ పోస్టర్లు అతికించాడు. మంచి భాగస్వామి కోసం తాను వెతుకుతున్నట్లు అందులో పేర్కొన్నాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు జగన్ పేర్కొన్నాడు. సంప్రదాయ పద్ధతుల్లో భాగస్వామిని వెతికేందుకు ప్రయత్నించిన అతడు.. అవి పనిచేయకపోయే సరికి ఈ మార్గం ఎంచుకున్నాడు.
అన్ని వివరాలతో పోస్టర్..
గోడలకు అంటించిన పోస్టర్లలో తన పేరు, కులం, వేతనం, వృత్తి, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ వివరాలన్నీ స్పష్టంగా ఉండేలా చూసుకున్నాడు. చిన్న స్థలం కూడా తన పేరు మీద ఉందని అందులో చెప్పుకొచ్చాడు. డెనిమ్ షర్ట్ వేసుకున్న ఫొటోను సైతం పోస్టర్‌పై ముద్రించాడు.