తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆక్సిజన్ సమస్యకు 'నానో మాస్క్​'తో చెక్!​ - మధురై ప్రొఫెసర్​ అరోకియాదాస్​

కరోనా 2.0 విజృంభణతో ప్రాణవాయువుకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్​ ఉత్పత్తి, సరఫరా చేసే కొత్తరకం మాస్క్​లను అభివృద్ధి చేశారు తమిళనాడుకు చెందిన ప్రొఫెసర్​. నానో టెక్నాలజీతో రూపొందించిన ఈ మాస్క్​ల ద్వారా ఆక్సిజన్​ సమస్యల్ని సులభంగా అధిగమించవచ్చునని ఆయన చెప్పారు.

Nano technology face mask
నానో టెక్నాలజీ మాస్క్​

By

Published : May 3, 2021, 2:47 PM IST

దేశంలో రెండోదశ కరోనా విజృంభణ నేపథ్యంలో.. కొవిడ్​ రోగులకు ఆక్సిజన్​ అనివార్యమైంది. వైరస్​ వ్యాప్తి కారణంగా మాస్క్​లు ధరించి, వదిలిన కార్బన్డయాక్సైడ్​నే మరలా పీల్చుకునే పరిస్థితి నెలకొంది. దీన్ని అధిగమించేందుకు కొత్త రకం మాస్క్​ను కనుగొన్నారు తమిళనాడు మధురైకి చెందిన ఓ విశ్వవిద్యాలయ ఆచార్యులు. నానో టెక్నాలజీతో రూపొందించిన ఈ ఫేస్​ మాస్క్​.. ఆక్సిజన్​ ఉత్పత్తి, సరఫరా చేస్తుంది.

నానో టెక్నాలజీ మాస్క్​ ఆవిష్కర్త అరోకియాదాస్​

కామరాజ్​ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్​ అరోకియాదాస్​ ఈ కొత్తరకం మాస్క్​లను ఆవిష్కరించారు. ప్రాణవాయువును అందించే ఈ కొత్త రకం మాస్క్​తో శ్వాస సంబంధిత సమస్యల్ని సులభంగా అధిగమించవచ్చునని ఆయన చెప్పారు.

మాస్క్​ను గురించి వివరిస్తున్న అరోకియాదాస్​

"నానో టెక్నాలజీతో రూపొందించిన ఈ మాస్క్​ ప్రాణవాయువును ఉత్పత్తి చేసి, సరఫరా చేస్తుంది. ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా కావాల్సిన ఆక్సిజన్​ గణాంకాల్ని లెక్కించేందుకు అధునాతన సాంకేతికతను జోడించాం. సెన్సార్​ టెక్నాలజీ, నూతన పరిజ్ఞానంతో ఆవిష్కరించిన దీని ధర రూ.500గా ఉంటుంది. వస్త్ర దుకాణాలు, విమానాశ్రయాలు, రైలు కంపార్ట్​మెంట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో అక్కడి ప్రజలకు సరైన మోతాదులో ఆక్సిజన్​ అందించేందుకు ఈ సాంకేతికత ఉపకరిస్తుంది. వీటిని విక్రయించేందుకు పలు ప్రైవేటు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే మార్కెట్​లోకి విడుదల చేస్తాం."

- అరోకియాదాస్​, కామరాజ్​ విశ్వవిద్యాలయ ఆచార్యులు

ఇదీ చదవండి:దేశంలో మరో 3.68 లక్షల మందికి కరోనా​

ABOUT THE AUTHOR

...view details