తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'స్థానిక' పోరులో డీఎంకే జోరు.. కార్యకర్తల సంబరాలు

TN Local Body election results: తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే దూసుకెళ్తోంది. ఇప్పటికే 21 గానూ 19 కార్పొరేషన్​లలో ఆధిక్యంలో ఉంది. సుమారు 109 మున్సిపాలిటీల్లో కూడా డీఎంకే అభ్యర్ధులు సత్తా చాటుతున్నారు.

Tamilnadu local body electiion
పార్టీ కార్యాలయం వద్ద సందడి చేస్తున్న కార్యకర్తలు

By

Published : Feb 22, 2022, 4:22 PM IST

Updated : Feb 22, 2022, 5:14 PM IST

TN Local Body election results: తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో డీఎంకే కూటమి 19 కార్పొరేషన్​లలో ఆధిక్యంలో ఉండగా, ఒక కార్పొరేషన్‌లో అన్నాడీఎంకే కూటమి ముందంజలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కన్యాకుమారిలోని పట్టణ పంచాయతీలో నామ్ తమిళర్ విజయం సాధించినట్లు పేర్కొన్నారు.

పార్టీ కార్యాలయం వద్ద డీఎంకే కార్యకర్తల వేడుకలు
చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం

గ్రేటర్​ చెన్నై కార్పొరేషన్​ ఎన్నికల్లో 200 వార్డులకు గానూ 97 వార్డులను డీఎంకే కైవసం చేసుకుంది. మరో 12 వార్డుల్లో అన్నాడీఎంకే, 7 వార్డుల్లో కాంగ్రెస్​, మూడు స్థానాల్లో స్వతంత్రులు, సీపీఎం, ఎండీఎంకేలు చెరో రెండు వార్డుల్లో గెలుపొందాయి. ఒక్క వార్డును సీపీఐ సొంతం చేసుకుంది.

వేడుకల్లో మునిగితేలుతున్న డీఎంకే కార్యకర్తలు
పార్టీ కార్యాలయం వద్ద సందడి చేస్తున్న కార్యకర్తలు

109 మున్సిపాలిటీల్లో డీఎంకే , తొమ్మిది మున్సిపాలిటీల్లో అన్నాడీఎంకే ఆధిక్యంలో ఉన్నాయి. పట్టణ పంచాయతీల్లో కూడా డీఎంకే జోరు కొనసాగుతోంది. 268 స్థానాల్లో అధికార పక్షం ముందంజలో ఉండగా, 22 స్థానాల్లో అన్నాడీఎంకే ఆధిక్యం కనబరుస్తోంది.

కొనసాగుతున్న స్థానిక సంస్థల కౌంటింగ్​
బ్యాలెట్​ పేపర్లను లెక్కపెడుతున్న సిబ్బంది

తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తంగా 21 కార్పొరేషన్లలతో పాటు 138 మున్సిపాలిటీలకు, 439 పట్టణ పంచాయతీలకు ఫిబ్రవరి 19 న జరిగాయి.

కౌంటింగ్​ కేంద్రాల్లో ఫలితాల కోసం అభ్యర్థుల ఎదురు చూపు

స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే ఆధిక్యంతో చెన్నైలోని ఆ పార్టీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. డీఎంకే కార్యకార్తలు వేడుకలు చేసుకుంటున్నారు.

ఇదీ చూడండి:

'భాజపా ఐదేళ్లలో చేసిన అభివృద్ధి.. వచ్చే 25ఏళ్లకు పునాది'

Last Updated : Feb 22, 2022, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details