తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూతురి లవర్​ను పొడిచి చంపిన తండ్రి.. తమ కులం కాదని... - పరువు హత్యలు

తమిళనాడులో దారుణం జరిగింది. తన కుమార్తెను ప్రేమించాడనే కోపంతో ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశాడు ఆమె తండ్రి. అయితే యువకుడు వేరే కులానికి చెందిన వ్యక్తి అయినందువల్లే హత్య చేసినట్లు తెలుస్తోంది.

Honour Killing
పరువు హత్య

By

Published : Oct 12, 2021, 1:08 PM IST

Updated : Oct 12, 2021, 1:27 PM IST

తమిళనాడు తంజావూరులో మరో పరువు హత్య వెలుగుచూసింది. తన కూతుర్ని ప్రేమిస్తున్నాడన్న కారణంతో కుమార్తె తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ఇదీ జరిగింది..

కుంభకోణం సమీపంలోని వేటమంగళం పండనల్లూరికి చెందిన ప్రభాకరన్ (22) ఆటో డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. అదే గ్రామంలో మణికందన్ అనే వ్యక్తి కుమార్తెతో ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడం వల్ల మణికందన్ కుటుంబం వీరి ప్రేమను వ్యతిరేకించింది.

ఈ క్రమంలో అక్టోబర్ 10న కామాచిపురం ఏరియా మార్కెట్‌లో ఉన్న ప్రభాకరన్​తో మణికందన్ గొడవపెట్టుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రభాకరన్​ను పొడిచాడు. పక్కనే ఉన్న అతని సోదరుడు విఘ్నేశ్​ను సైతం గాయపపరిచాడు. తీవ్ర గాయాలపాలైన ప్రభాకరన్​ను కుంభకోణం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రభాకరన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. మణికందన్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 12, 2021, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details