తమిళనాడులో పూర్తిస్థాయి లాక్డౌన్ - తమిళనాడులో లాక్డౌన్
తమిళనాడులో పూర్తిస్థాయి లాక్డౌన్
08:46 May 08
తమిళనాడులో పూర్తిస్థాయి లాక్డౌన్
కరోనా కట్టడికి రాష్ట్రాలన్నీ ఒక్కొక్కటిగా లాక్డౌన్ తరహా ఆంక్షలవైపు అడుగులు వేస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. మే 10 నుంచి 24 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది.
కరోనా కట్టడికి ఒడిశా, కేరళ ఇప్పటికే లాక్డౌన్లోకి జారుకున్నాయి. మే 10 నుంచి కర్ణాటకలో కూడా పూర్తి స్థాయి లాక్డౌన్ అమలుకానుంది.
Last Updated : May 8, 2021, 9:07 AM IST