తమిళనాడులో దారుణం జరిగింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి నదిలో దూకి (man dies jumping into river) ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. నదిలో దూకి.. - నీటిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి నదిలో దూకి (man dies jumping into river) ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన తమిళనాడులో జరిగింది.
నదిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
శరవణన్ (46), కూలీ పని చేస్తూ చెన్నై శివారు ప్రాంతంలో నివసిస్తున్నాడు. తన నివాసానికి దగ్గరలోని శ్మశానవాటికలో స్నేహితులతో కలిసి శుక్రవారం పేకాట ఆడుతున్నాడు. ఈ క్రమంలో పోలీసులు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించగా.. వారి నుంచి తప్పించుకునేందుకు శరవణన్ పరుగు ప్రారంభించాడు. దగ్గరలోని కూవమ్ నదిలో దూకాడు. అప్రమత్తమైన యంత్రాంగం బోట్ల సహాయంతో గాలించినా.. ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందాడు.
Last Updated : Nov 7, 2021, 11:23 AM IST