తెలంగాణ

telangana

By

Published : Jul 6, 2021, 3:05 PM IST

ETV Bharat / bharat

సీఎం సైకిల్​పై వచ్చి సర్​ప్రైజ్​ చేస్తే...

ఆయన ఓ రాష్ట్రానికి సీఎం. ఆయన ఏం చేసినా ఆ పనిలో తనదైన ముద్ర వేస్తారు. తాజాగా రోడ్డు మీద ఉదయాన్నే సైకిల్​ తొక్కుతూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఆయన సైక్లింగ్​కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

tamilnadu CM Stalin surprises people with cycle ride
నగర వీధుల్లో సైకిల్​పై సీఎం సవారీ

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్​.. సైక్లింగ్​పై ఉన్న మక్కువను మరోమారు చాటుకున్నారు. చెన్నై ఈసీఆర్​ ప్రాంతంలో సైకిల్​పై చక్కర్లు కొట్టి అక్కడి వారిని ఆశ్చర్యపరిచారు.

పాతే.. కానీ కొత్తగా..

స్టాలిన్​కు సైక్లింగ్​ కొత్తేమీ కాదు. ప్రతిపక్ష నేత హోదాలో అనేకమార్లు ఆయన అదే ఈసీఆర్​(ఈస్ట్ కోస్ట్ రోడ్​)లో సైక్లింగ్​ చేశారు. కానీ ఏప్రిల్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సైకిల్​ సవారీ ఆయనకు ఇదే తొలిసారి.

సీఎంతో ఫొటో కోసం..

ఇదీ చూడండి:-చిన్నారి సాయానికి ఫిదా- సీఎం 'సైకిల్'​ గిఫ్ట్​

ఆదివారం ఉదయం 5:45 గంటలకు ముత్తుకదు వద్ద మొదలుపెట్టి కోవలమ్​ వరకు సైకిల్​ తొక్కారు సీఎం. దారిపొడవునా భారీ భద్రతా బలగం ఆయన వెన్నంటే వెళ్లింది.

సీఎంతో ఫొటో కోసం
టీ స్టాల్​లో

ఈ నేపథ్యంలో తోటి సైక్లిస్ట్​లతో నవ్వుతూ మాట్లాడారు స్టాలిన్​. కోవలమ్​లోని కేఫ్​ 4 యూ టీ స్టాల్​లో టీ తాగారు. అక్కడికి వచ్చిన కొందరు సైక్లిస్ట్​లతో ఫొటోలు దిగారు. సీఎం సైక్లింగ్​ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

వృద్ధురాలితో సీఎం మాటామంతి

ఇదీ చూడండి:-ఒలింపిక్స్​ విజేతలకు సీఎం బంపర్​ ఆఫర్​

ABOUT THE AUTHOR

...view details