తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Tamilnad Mercantile Bank 9000 Crore : క్యాబ్​ డ్రైవర్​ ఖాతాలో రూ.9వేల కోట్లు.. వారం రోజులకే బ్యాంక్​ MD రాజీనామా

Tamilnad Mercantile Bank 9000 Crore : తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఎండీ, సీఈవో పదవికి ఎస్​ కృష్ణన్​ రాజీనామా చేశారు. ఓ క్యాబ్​ డ్రైవర్​ ఖాతాలో రూ.9వేల కోట్లు తప్పుడు జమ అయిన వారంరోజులకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Tamilnad Mercantile Bank MD and CEO S. Krishnan resigned
Tamilnad Mercantile Bank MD and CEO S. Krishnan resigned

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 7:23 AM IST

Tamilnad Mercantile Bank 9000 Crore : తమిళనాడు మర్కంటైల్​ బ్యాంక్​ మేనేజింగ్​ డైరెక్టర్​ & సీఈవో ఎస్​ కృష్ణన్​.. తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బ్యాంక్​ బోర్డు గురువారం ఆమోదించింది. అనంతరం రిజర్వ్​ బ్యాంక్​కు ఆయన లేఖను ఫార్వార్డ్​ చేసింది. ఇటీవలే ఈ బ్యాంక్​లో ఖాతా ఉన్న ఓ క్యాబ్​ డ్రైవర్​కు రూ.9వేల కోట్లు జమైన వారం రోజులకే కృష్ణన్​ రాజీనామా చేయడం గమనార్హం.

Tamilnad Mercantile Bank MD And CEO : గతేడాది సెప్టెంబర్​ 4న కృష్ణన్​.. బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మూడింట రెండు వంతుల పదవీకాలం ఉన్నప్పటికీ, వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆయన తన రాజీనామాను సమర్పించారు. "నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే, బ్యాంక్‌కు ఒకే ఒక్కరు పూర్తి సమయం డైరెక్టర్‌గా ఉన్నందున, ఈ విషయంలో నేను ఆర్‌బీఐ మార్గదర్శకత్వాన్ని కోరుతాను" అని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

ఎస్​ కృష్ణన్​

క్యాబ్​ డ్రైవర్​ ఖాతాలో రూ.9వేల కోట్ల సంగతేంటి?
Cab Driver Get 9000 Crore : వారం రోజుల క్రితం.. పళని నెయ్​కారాపట్టికి చెందిన రాజ్​కుమార్ అనే వ్యక్తి ఖాతాలో ఉన్నట్టుండి అక్షరాల రూ.9 వేల కోట్లు జమ అయ్యాయి. కారును రెంట్​కు తీసుకొని నడిపిస్తున్న రాజ్​కమార్​ ఫోన్​కు సెప్టెంబర్​ 9న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తూత్తుకూడి జిల్లాలోని తమిళనాడు మెర్కంటైల్​ బ్యాంక్​ ప్రధాన కార్యాలయం నుంచి ఓ సందేశం వచ్చింది. అందులో రాజ్​కుమార్​ ఖాతాలోకి ఏకంగా రూ.9 వేల కోట్లు డిపాజిట్​ అయినట్లుగా మెసేజ్​ ఉంది. కేవలం రూ.15లు ఉన్న తన బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తం ఎవరు జమ చేసి ఉంటారని రాజ్​కుమార్​ అనుకున్నాడు.

రాజ్​కుమార్ ఖాతా మినీ స్టేట్​మెంట్​, మెసేజ్​లు

అయితే ఆ మెసేజ్​ నిజమో కాదో అని తెలుసుకునేందుకు.. తన స్నేహితుడికి అప్పుగా ఇవ్వాల్సిన రూ.21 వేలను అతడికి పంపించి చూశాడు. ఆ లావాదేవీ సక్సెస్​ అయింది. ఆ తర్వాత కాసేపటికే రాజ్​కుమార్​కు సంబంధిత బ్యాంకు నుంచి ఫోన్​ కాల్​ వచ్చింది. అందులో 'దయచేసి మీ బ్యాంక్​ అకౌంట్​లో డిపాజిట్​ అయిన రూ.9 వేల కోట్ల సొమ్మును వాడకండి. అవి పొరపాటున మీకు బదిలీ అయ్యాయి' అని బ్యాంక్​ అధికారులు చెప్పారు. తాను రూ.21వేలను వాడుకున్నానని బ్యాంకు సిబ్బందికి రాజ్​కుమార్​ తెలిపాడు. దీంతో బ్యాంకు మేనేజ్​మెంట్​.. వినియోగించిన డబ్బును తిరిగి చెల్లించాల్సిందిగా రాజ్​కుమార్​ను కోరారు. లేదంటే చర్యలు తీసుకుంటామని అతడిని బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే రాజ్​కుమార్​ దగ్గర్లోని పోలీస్​ స్టేషన్​కు వెళ్లి సదరు బ్యాంకు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశాడు. రాజ్​కుమార్​ కంప్లైంట్​ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇరు వర్గాల న్యాయవాదులను పిలిపించి రాజీ కుదిరించారు.

ABOUT THE AUTHOR

...view details