అన్నాడీఎంకే బహిష్కృత నేత, జయలలిత నిచ్చెలి వీకే శశికళ(63) జైలు నుంచి విడుదలయ్యారు. అవినీతి కేసులో నాలుగేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెను.. శిక్షాకాలం ముగిసినందున ఇవాళ విడుదల చేశారు అధికారులు. జనవరి 20న కరోనా బారినపడ్డ శశికళ.. ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆమె విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జైలు అధికారులు ఆస్పత్రిలోనే పూర్తి చేశారు.
జైలు నుంచి విడుదలైనప్పటికీ అనారోగ్య కారణాల దృష్ట్యా ఆమె కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందనున్నారు. ఇంకో 10 రోజులు శశికళకు చికిత్స అవసరమని ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ అన్నారు.