తమిళనాట ఓట్ల పండుగకు సర్వం సిద్ధమైంది. 234 శాసనసభ స్థానాలకు మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.
మొత్తం 3,998 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. విజయంపై అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే విశ్వాసంగా ఉన్నాయి.
తమిళనాడు ఎన్నికలు- 2021
- శాసనసభ స్థానాలు: 234
- మొత్తం అభ్యర్థులు: 3,998
- ఓటర్లు: 6,26,74,446
- పురుషులు: 3,08,38,47
- మహిళలు: 3,18,28,727
- ఇతరులు: 7,246
- పోలింగ్ కేంద్రాలు: 88,937
దిగ్గజ నేతలు లేకుండా తొలిసారి బరిలో..
తమిళ రాజకీయాలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు కరుణానిధి, జయలలిత. రాష్ట్ర రాజకీయాల్లో, రాష్ట్ర ప్రజల్లో వారిది చెరగని ముద్ర. అలాంటిది.. ఎన్నో దశాబ్దాల తర్వాత.. ఈ దిగ్గజ నేతలు లేకుండా తొలిసారి పూర్తిస్థాయి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఏఐడీఎంకే కూటమి
- ఏఐఏడీఎంకే- 179
- పీఎంకే(పట్టాయ్ మక్కల్ కచ్చి): 23 స్థానాలు
- భాజపా(భారతీయ జనతా పార్టీ): 20 స్థానాలు
డీఎంకే కూటమి
- డీఎంకే- 173
- కాంగ్రెస్: 25 స్థానాలు
- సీపీఐ: 6 స్థానాలు
- సీపీఎం: 6 స్థానాలు
ఉత్కంఠ..