తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాఠశాలలో ఆరెస్సెస్ కార్యక్రమం.. వామపక్ష సంఘాలు ఫైర్​ - కోయంబత్తూర్ ఆరెస్సెస్ కార్యక్రమం

తమిళనాడులోని ఓ పాఠశాలలో ఆరెస్సెస్ నిర్వహిస్తున్న కార్యక్రమంపై వామపక్ష సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పెద్ద ఎత్తున ఆందోళన చేయడం వల్ల.. ఉద్రిక్తత తలెత్తింది.

Tamil political groups agitation in coimbatore!!
Tamil political groups agitation in coimbatore!!

By

Published : Jan 1, 2022, 7:47 PM IST

వామపక్ష సంఘాల ఆందోళనతో ఉద్రిక్తత

RSS Program in school: తమిళనాడు కోయంబత్తూర్​లోని ఓ పాఠశాల క్యాంపస్​లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) నిర్వహించిన కార్యక్రమానికి వ్యతిరేకంగా పలు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో పాఠశాల వద్ద.. ఆరెస్సెస్, భాజపా కార్యకర్తలకు.. ఆందోళన సంఘాల సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది.

Protests against RSS school event

విలాన్​కురిచిలోని ఓ పాఠశాలలో ఎనిమిది రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఆరెస్సెస్. దీన్ని వ్యతిరేకిస్తూ నామ్ తమిళార్ కచ్చి(ఎన్​టీకే), మక్కల్ అతికరమ్, వీసీకే, టీపీడీకే సహా పలు వామపక్ష సంఘాలు ఆందోళన చేప్టటాయి. ఈ క్రమంలో భాజపా, ఆరెస్సెస్ కార్యకర్తలకు, వామపక్ష నిరసనకారులకు మధ్య మాటల యుద్ధం జరిగింది.

రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఆరెస్సెస్ జిల్లా కార్యదర్శి మురుగాబ్, నేతలు అరుణ్, కరుప్ప సామి, భాజపా నేత కాలిదాస్, హిందూ మున్నాన్ సంఘానికి చెందిన గోవిందన్​లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులపై.. 'ప్రభుత్వ అధికారులను అడ్డుకోవడం, చట్టవ్యతిరేకంగా సమావేశం కావడం' వంటి అభియోగాలను మోపారు. ఆందోళనలో పాల్గొన్న వామపక్ష సంఘాల కార్యకర్తలను అదుపులోకి తీసుకొని విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరినీ అరెస్టు చేయలేదని వెల్లడించారు.

ఇదీ చదవండి:2021లో మహిళలపై పెరిగిన దాడులు- 50% యూపీలోనే

ABOUT THE AUTHOR

...view details