'డెల్టా'లో వరద బీభత్సం- 1.5లక్షల ఎకరాల పంట నాశనం గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమిళనాడు(tamil nadu weather) ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ముఖ్యంగా కావేరీ డెల్టా ప్రాంతంలోని జిల్లాల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి(tamil nadu rain news live). ఆ ప్రాంతంలో దాదాపు 1.5లక్షల ఎకరాల పంట నాశనమైనట్టు సమాచారం. తిరువారుర్లో 50వేల ఎకరాలు, కుద్దలూరులో 25వేల ఎకరాలు, నాగపట్టినమ్లో 30వేల ఎకరాలు, మయిలదుథూరైలో 20వేల ఎకరాలు, తంజావుర్లో 10వేల ఎకరాల పంటలు నీటమునిగినట్టు విపత్తు నిర్వహణ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ వెల్లడించారు.
పంట నష్టం.. రైతన్న కన్నీరు చేతికి అందివచ్చిన పంట నాశనమవ్వడం వల్ల అన్నదాతలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.
పంట నష్టంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(mk stalin news) ఓ కమిటీని ఏర్పాటు చేశారు. పరిస్థితులను సమీక్షించి ఈ కమిటీ సీఎంకు నివేదిక అందిస్తుంది.
రాష్ట్రంలో ఇదీ పరిస్థితి..
తమిళనాడులో కొన్నిరోజుల నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాల (rains in chennai) కారణంగా చాలా ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 4 రోజుల్లో 91 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రాజధాని చెన్నైలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. వరద నీరు ఎక్కడికక్కడే నిలిచిపోవడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నై సహా చుట్టు పక్కల ఉన్న చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, విల్లుపురం ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో వాననీరు నిలిచింది. రహదారులపై మోకాలు లోతులో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇళ్లు, ఆస్పత్రుల్లోకి వరద నీరు చేరింది. చెన్నై కేకే నగర్లోని ఈఎస్ఐ ఆస్పత్రి జలమయమయింది. రోగుల వార్డుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే రోజువారీగా వచ్చే అవుట్ పేషెంట్ వార్డుతో సహా అన్ని విభాగాలు పనిచేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చెన్నైలోని మెరీనా బీచ్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద‌్దని ప్రభుత్వం సూచించింది. వర్షానికి తోడు చెన్నైలో తీవ్రగాలులు వీస్తున్నాయి. దీంతో చెన్నై ఎయిర్పోర్ట్ను గురువారం మధ్యాహ్నం తాత్కాలికంగా మూసివేశారు.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (tamilnadu rain news) బలపడి వాయుగుండంగా మారినట్లు పేర్కొన్న వాతావరణ విభాగం.. గురువారం సాయంత్రం తీరం దాటనున్నట్లు పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అప్రమత్తం చేసింది.
ఇవీ చూడండి:-