Tamil nadu youngster Coffee shop: ప్రపంచాన్ని రెండేళ్లుగా కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇప్పుడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. కొవిడ్ కారణంగా అనేక మంది తమ ఉపాధిని కోల్పోయారు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కానీ, ఈ కరోనా కల్లోలంలోనూ కొంత మంది విభిన్నంగా ఆలోచించి లాభాలను ఆర్జిస్తున్నారు. అలాంటి వారిలో తమిళనాడుకు చెందిన సొలోమాన్ రాజ్ ఒకడు.
Coffee shop with jaggery: సొలోమాన్ రాజ్ మధురైలో 'సాయా కారుపట్టి కాపీ' పేరుతో ఓ కాఫీ షాపును నిర్వహిస్తున్నాడు. కాఫీ, టీ అంటే ఎక్కడైన చక్కెరనే వినియోగిస్తారు. కానీ, సొలోమాన్ రాజ్ షాపులో మాత్రం ఓ ప్రత్యేకత ఉంటుంది. అదేంటంటే.. ఈ షాపులో దొరికే కాఫీ, టీ, పాలలో పంచదారను వాడరు. దానికి బదులుగా బెల్లాన్ని వినియోగిస్తారు.
పాత రోజుల్లో కాఫీ, పాలు, టీలలో బెల్లాన్నే వినియోగించేవారని.. కానీ, ఆ తర్వాతే చక్కెర వినియోగం పెరిగిందని చెప్పాడు సొలోమోన్ రాజ్. పంచదార కంటే బెల్లాన్ని వాడితే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనరం అని అతను అంటున్నాడు. కొవిడ్‌ను ఎదుర్కోవాలంటే పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నందున ఇలా కాఫీ, టీలను తాగితే ఆరోగ్యానికి మంచిదని అతను చెబుతున్నాడు.
"బెల్లం శరీరానికి కాల్షియాన్ని అందిస్తుంది. అందుకే మేం మా షాపులో టీ, కాఫీ, పాల కోసం మామాలు పంచదారకు బదులుగా బెల్లాన్ని, నాటు చెక్కరను వినియోగిస్తాం. దీన్ని మా కస్టమర్లు ఎంతో ఇష్టపడుతారు."
-సొలోమాన్ రాజ్, కాఫీ షాపు యజమాని.
కరోనా పాలు ఫుల్ ఫేమస్!