తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళ స్టైలిష్​ హెయిర్​ కటింగ్​- పురుషుల క్యూ - హేర్​స్టైల్​ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోన్న మేరీ

ఆమె పేదరికాన్నే కాదు.. సెలూన్​ షాప్​పై ఉన్న పురుషాధిక్యతను సవాల్​ చేసింది. సవాల్​ చేయడమే కాదు అందులో విజయం సాధించింది. ఓ మహిళ.. పురుషులకు హెయిర్​ కటింగ్​ చేయడమేంటి అని సెలూన్​ షాప్​నకు ముఖం చాటేసిన వారే ఇప్పుడు ఆ మహిళ చేస్తున్న హెయిర్​ స్టైల్​కు ఫిదా అయి సెలూన్​ వద్ద క్యూ కడుతున్నారు.

Tamil Nadu woman maintain men's saloon
సవాళ్లను అధిగమించి.. సెలూన్​ షాప్​ నిర్వహిస్తూ..

By

Published : Feb 16, 2021, 8:58 PM IST

Updated : Feb 16, 2021, 9:12 PM IST

సవాళ్లను అధిగమించి.. సెలూన్​ షాప్​ నిర్వహిస్తూ..

తమిళనాడులోని త్రిచీకి చెందిన ఈమె పేరు పాట్రిసియా మేరి. ఏడు సంవత్సరాల క్రితం ఆమె భర్త రుబన్​ షణ్ముగనాథన్​.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఒంటిరిదైన ఆమె తన ఇద్దరి పిల్లల్ని పోషించాల్సిన బాధ్యతను తలకెత్తుకుంది. భర్త సంపాదించిన ఆస్తి అంటూ ఏమీ లేదు. చింతమాణి పట్టణంలో ఉన్న ఒక్క సెలూన్​ షాపు తప్ప. షాపులో పని చేయడానికి ఎందరో పురుషుల్ని బతిమిలాడింది. అయినా ఎవరూ ముందుకు రాలేదు. దాంతో తనే కత్తెర పట్టింది. హెయిర్​ కటింగ్​ చేయడం మొదలెట్టింది. మహిళ దగ్గర ఎవరు హెయిర్​ కటింగ్​​ చేయించుకుంటారంటూ ఆమె సెలూన్​ వైపు పురుషులు రాలేదు. అయినా ఆమె ఆందోళన చెందలేదు. రానురాను ఆమె చేస్తున్న హెయిర్​ స్టైల్​ తీరును చూసి ఆ సెలూన్​కు​ వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగింది.

"ఏడేళ్ల నుంచి హెయిర్​ కటింగ్​ ​ వృత్తిలో ఉన్నాను. నా భర్త చనిపోయినప్పుడు చాలా వేధన అనుభవించాను. పిల్లల్ని ఎలా పోషించడం అని తీవ్రంగా మథన పడ్డాను. నా భర్త సెలూన్​ షాప్​లో పనిచేయమని ఎందరో పురుషుల్ని అడిగాను. ఎవరూ ముందుకు రాలేదు. దాంతో నేనే హెయిర్​ కటింగ్​ చేయడం మొదలెట్టాను. కేవలం నగరాలు, పట్టణాలలోని సెలూన్​ షాప్​లలో మాత్రమే మహిళలు పని చేస్తారు. మొదట నా షాప్​నకు ఎవరూ వచ్చేవారు కాదు. వచ్చినా కుర్చీలో కూర్చోని వెంటనే వెళ్లిపోయేవారు. కానీ రానురాను నేను చేస్తున్న హెయిర్​ స్టైల్​ చూసి చాలా మంది వస్తున్నారు. ఈ షాప్​ ద్వారా వచ్చే కొద్ది ఆదాయంతో ఇల్లు గడుస్తోంది. నా పిల్లల్ని చదివించగలుగుతున్నాను."

-పాట్రిసియా మేరి, సెలూన్​ షాపు యజమాని

సెలూన్​కి వచ్చే చాలా మంది పురుషులు ఆమె చేస్తోన్న హెయిర్​ ​స్టైల్​ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

"చాలా సంవత్సరాలనుంచి ఇక్కడికి వస్తున్నాను. మొదట మహిళ దగ్గర హెయిర్​ కట్​ చేయించుకోవడమేంటని ఇక్కడికి రాలేదు. కానీ హెయిర్​ స్టైల్​ బాగా ఉండడం వల్ల ఇక్కడి వస్తున్నాను. చాలా మంది స్థానికులు ఇక్కడికి హెయిర్ ​కట్​ చేయించుకోవడానికి వస్తున్నారు."

-శేఖర్​, స్థానికుడు

ఇదీ చూడండి:భారత్ 'మాస్టర్ స్ట్రోక్​' వల్లే తోకముడిచిన డ్రాగన్!

Last Updated : Feb 16, 2021, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details