తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.3 కోట్ల బీమా కోసం.. కారులోనే భర్తను కడతేర్చి - భర్తను చంపిన భార్య

తమిళనాడులో అమానవీయ ఘటన జరిగింది. రూ.3 కోట్ల బీమా​ డబ్బుల కోసం భర్తను కడతేర్చింది ఓ భార్య. చివరికి పోలీసులకు చిక్కింది.

Tamil Nadu woman burns husband in car
రూ.3 కోట్ల ఇన్సురెన్స్​ డబ్బుల కోసం భర్తను కడతేర్చింది భార్య

By

Published : Apr 10, 2021, 10:42 AM IST

బీమా​ డబ్బులు రూ.3 కోట్ల కోసం భర్తను చంపిన ఘటనలో భార్యను, దగ్గరి బంధువును పోలీసులు అరెస్టు చేశారు. ఈ అమానవీయ ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది..

జిల్లాలోని తుడుపతి పట్టణానికి చెందిన రంగరాజన్​( 60)అనే వ్యక్తి పవర్​లూమ్​ యజమాని. రియల్​ ఎస్టేట్​ వ్యాపారం కూడా చేస్తాడు. కాలు గాయమై గత నెలలో ఆసుపత్రిలో చేరాడు. గురువారం డిశ్ఛార్జ్ చేయగా.. ఆయన భార్య జ్యోతిమయి(55), దగ్గరి బంధువు కలిసి కారులో తుడుపతిలో ఉన్న ఇంటికి తీసుకువస్తున్నారు.

రూ.3 కోట్ల బీమా​ డబ్బుల కోసం భర్తను కడతేర్చిన భార్య

మార్గ మధ్యలో ముందే నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం భర్తను కారులోనే ఉంచి పెట్రోల్​ పోసి నిప్పంటించారు. అనుకోకుండా కారులో మంటలు చెలరేగి తన భర్త చనిపోయాడని పోలీసులకు జ్యోతిమయి కట్టుకథలు చెప్పింది. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం.. అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రంగరాజన్​ను ఆయన భార్య, దగ్గరి బంధువు కలిసి హత్య​ చేశారని తేలింది.

ఇదీ జరిగింది:వేర్వేరు అగ్నిప్రమాదాల్లో ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details