తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సహోద్యోగులపై వైద్యులు అత్యాచారం.. చివరకు.. - చెన్నై రేప్ కేసు

కరోనా సమయంలో వైద్యులనే దేవుళ్లుగా కొలిచారు. కానీ, ఓ ఇద్దరు వైద్యులు మాత్రం వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించారు. క్వారంటైన్​లో ఉండగా.. తమ తోటి మహిళా ఉద్యోగులపై అత్యాచారానికి పాల్పడ్డారు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది.

doctors sacked for raping colleagues
d

By

Published : Nov 20, 2021, 10:46 PM IST

తమిళనాడులో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే ఇద్దరు వైద్యులు.. మహిళా సహోద్యోగులపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారిని లైంగిక వేధింపులకు గురి చేశారు. నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

అసలేమైందంటే..?

చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎస్​. వెట్రిసెల్వన్​(35), ఎన్​.మోహన్​ రాజ్​(28) వైద్యులుగా పని చేస్తున్నారు. ఆగస్టులో.. కరోనా నిబంధనల కారణంగా.. తమ ఆస్పత్రిలో పని చేసే మహిళా సహోద్యోగులతో కలిసి టి.నగర్​లోని ఓ ఆస్పత్రిలో క్వారంటైన్​లో ఉన్నారు.

ఆ సమయంలో ఓ వైద్యురాలిపై వెట్రి సెల్వన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో వైద్యుడు మోహన్ రాజ్ కూడా మరో వైద్యురాలిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. అప్పటి నుంచి వారిద్దరు చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు.

నిందితులు

ఈ వ్యవహారంపై బాధితులు.. రాజీవ్​ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి అధిపతి తారణి రాజన్​కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత టి.నగర్ డిప్యూటీ కమిషనర్ హరికిరణ్ ప్రసాద్​​కు తారణి రాజన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టి, నిందితులను గురువారం అరెస్టు చేశారు. వారిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ప్రస్తుతం ఈ కేసును విశాఖ కమిటీ దర్యాప్తు చేస్తోంది. ఇంకా ఎంత మంది వీరి వేధింపులకు గురయ్యారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న కమిటీ.. వాటిని సైబర్ ల్యాబ్​కు పంపించింది.

ఇదీ చూడండి:బాలికపై లైంగిక వేధింపులు.. లేఖ రాసి ఆత్మహత్య

ఇదీ చూడండి:ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు.. 10 నెలల్లో రెండు రేప్​ కేసులు!

ABOUT THE AUTHOR

...view details