తమిళనాడులోని మందు బాబులకు కిక్ ఇచ్చే ప్రకటన చేసింది సర్కారు. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో నేటి నుంచి వైన్ షాపులు తెరుచుకోనున్నాయని తెలిపింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు అవి తెరిచి ఉంటాయి. కరోనా కేసులు తగ్గుతోన్న నేపథ్యంలో మే 10న విధించిన ఆంక్షల సడలింపులో(Unlock) భాగంగా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది. దీంతో లిక్కర్ కోసం ఆంధ్రాకు క్యూ కట్టిన మందుబాబులకు.. ఆ శ్రమ తప్పనుంది.
సెలూన్లు, ఆటోలు..
చెన్నై సహా 27 జిల్లాల్లో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలను 50 శాతం సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతించింది రాష్ట్ర ప్రభుత్వం. పార్కులు ఉదయం 6 నుంచి 9 వరకు తెరిచి ఉంటాయని తెలిపింది. ట్యాక్సీలు, ఆటోలు నడిచేందుకు అనుమతించింది.
దశలవారీ అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా అంబాలాలో జిమ్‌లను 50 శాతం సామర్థ్యంతో నిర్వహించేందుకు హరియాణా సర్కారు అనుమతించింది.