తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సిలిండర్ పేలి భవనాలు నేలమట్టం- ఐదుగురు మృతి

ఓ ఇంట్లో గ్యాస్​ సిలిండర్ పేలిన ఘటనలో(cylinder blast) ఐదుగురు మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడులో ఈ ప్రమాదం జరిగింది.

Cylinder blast
పేలిన సిలిండర్

By

Published : Nov 23, 2021, 3:46 PM IST

Updated : Nov 23, 2021, 6:04 PM IST

సిలిండర్ పేలి భవనాలు నేలమట్టం

తమిళనాడు సేలం జిల్లాలో ఘోర విషాద ఘటన జరిగింది. సిలిండర్ పేలి ఐదుగురు మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మూడు భవనాలు..

సేలం జిల్లాలోని(Tamil nadu salem news) కరుంకల్ పట్టి ప్రాంతంలోని ఓ వ్యక్తి ఇంట్లో మంగళవారం ఉదయం 6:30 గంటలకు పెద్ద శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఆ ప్రాంతంలోని మూడు భవనాలు నేలకూలాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా మొత్తం ఐదుగురు మృతి చెందారు.

ధ్వంసమైన భవనాలు
ఘటనాస్థలిలో సహాయక చర్యలు

ఓ ఐదేళ్ల బాలిక సహా శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. వారికి తీవ్రగాయాలు కాగా.. సేలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

రోదిస్తున్న మృతుల బంధువులు
శిథిలాలను జేసీబీతో తొలగిస్తున్న దృశ్యం

ఘటనాస్థలికి సేలం జిల్లా కలెక్టర్ కార్మేఘమ్​, పోలీసు ఉన్నతాధికారులు చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షించారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్​డీఆర్ఎఫ్​)తో పాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్న మిగతావారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:ఘోర ప్రమాదం- ఒకే కుటుంబంలోని ఐదుగురు దుర్మరణం

ఇదీ చూడండి:స్కూల్ బస్సు మిస్​ అయిందని.. విద్యార్థి ఆత్మహత్య!

Last Updated : Nov 23, 2021, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details