దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. ఆరుగురు మృతి - యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం
11:11 March 19
09:09 March 19
దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. ఆరుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ వ్యాన్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో మినీ వ్యాన్‌లో 9 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన ముగ్గురుని తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం వేకువజామున జరిగిందీ ఘటన. మృతుల్లో నలుగురు పురుషులు, ఓ మహిళలతో పాటుగా చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆదివారం తెల్లవారుజామున 3:50 గంటల సమయంలో తిరుచ్చి బైపాస్ సమీపంలో ఓ మినీ వ్యాన్‌ను లారీ ఢీకొట్టింది. సేలం జిల్లా ఎడప్పాడి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం మినీ వ్యాన్‌లో దైవ దర్శనానికి బయలుదేరారు. అయితే వారు తిరువాసి గ్రామ సమీపానికి వస్తున్న సమయంలో.. తిరుచ్చి నుంచి కరూర్ వైపుగా వస్తున్న ఓ లారీ వేగంగా వచ్చి వ్యాన్‌కు బలంగా ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న నలుగురు పురుషులు, ఓ మహిళలతో పాటుగా చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను బయటకు తీసి శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పరస్పరం ఢీకొన్న కార్లు..
దేశ రాజధాని దిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి రెండు కార్లు పరస్పరం ఢీన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఒక్కసారిగా గట్టిగా కేకలు వేడయం వల్ల స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు.. చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. హుటహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నొయిడాలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఈ ప్రమాదంలో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ రెండు కార్లు ఆగ్రా నుంచి నొయిడాకు వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.