తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాట తగ్గిన కరోనా ఉద్ధృతి - మహారాష్ట్రలో కరోనా మరణాలు

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రోజువారి కరోనా కేసులు కాస్త తగ్గాయి. మహారాష్ట్రలో కొత్తగా 10 వేలకుపైగా కేసులు బయటపడగా.. కన్నడ నాట 7 వేల మందికి వైరస్​ సోకింది.

corona cases
కరోనా కేసులు

By

Published : Jun 13, 2021, 11:15 PM IST

Updated : Jun 14, 2021, 12:35 AM IST

తమిళనాడులో రోజువారి కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైంది. ఈవాళ ఒక్కరోజే 14,016 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 267 మంది కొవిడ్​తో మృతి చెందారు. మరో 25,895 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో క్రియాశీల​ కేసుల సంఖ్య 2 లక్షలకు దిగువకు చేరింది.

దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 255 కేసులు బయటపడ్డాయి. 23 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు.

కేరళలో రోజువారి కొవిడ్​ కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 11,584 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 206 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో కొత్తగా 10,442 మందికి కరోనా సోకింది. మరో 483 మంది వైరస్​తో ప్రాణాలు వదిలారు.

కర్ణాటకలోనూ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈవాళ ఒక్కరోజే 7,810 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. కొవిడ్​​ ధాటికి మరో 125 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

  • జమ్ముకశ్మీర్​లో 774 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. మరో 12 మంది మరణించారు.
  • గుజరాత్​లో 455 కేసులు నమోదవగా.. 8 మంది మృత్యువాత పడ్డారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో మరో 468 మంది కరోనా బారిన పడ్డారు. వైరస్​తో 53 మంది కన్నుమూశారు.
  • మధ్యప్రదేశ్​లో కొత్తగా 274 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. మరో 18 మంది మృతి చెందారు.

ఇదీ చూడండి:'కరోనా మాత' ఆలయం కూల్చివేత

Last Updated : Jun 14, 2021, 12:35 AM IST

ABOUT THE AUTHOR

...view details